Power Star Pawan Kalyan: పవన్ కల్యాణ్ కెరీర్ లో హిట్ల కన్నా ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు పదేండ్ల పాటు ఎలాంటి హిట్ లేకపోయినా కూడా అదే స్థాయిలో ఫ్యాన్ బేస్‌ను మెయింటేన్ చేయడం అంటే ఒక్క పవన్‌కే సాధ్యం అయింది. వేరే వేరే హీరోలకు అయితే అన్ని ఏండ్లు హిట్ రాకపోతే అభిమానులు ఎప్పుడో వారిని మర్చిపోయేవారు. కానీ పవన్‌కు మాత్రం హిట్టు, ప్లాపులతో సంబంధం లేదు. కానీ రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత ఆయనకు బాగానే కలిసి వస్తోంది.

లాంగ్ గ్యాప్ తర్వాత చేసిన వకీల్ సాబ్ దుమ్ము లేపింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే అప్పుడు లాక్ డౌన్ లాంటిది లేకపోతే మాత్రం.. కలెక్షన్ల పరంగా ఊచకోతే ఉండేదేమో. అయితే అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు భీమ్లానాయక్ తో తీర్చుకున్నాడు పవన్. ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టి మూడు రోజుల్లోనే రూ.100కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి బిగ్ అప్ డేట్
అయితే కెరీర్ మొదట్లో పవన్ డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు. కానీ వాటి తర్వాత మళ్లీ ఆ రికార్డు అందుకోలేదు. అయితే ఇన్నేండ్ల తర్వాత మళ్లీ హ్యాట్రిక్ రికార్డు పవన్‌ను ఊరిస్తోంది. ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు మూవీని చేస్తున్నాడు పవన్. ఇందులో రెండు పాత్రల్లో నటిస్తున్నాడు పవర్ స్టార్. ఈ మూవీ మొత్తం పునర్జన్మల చుట్టూ నడిచే కథలాగా తెలుస్తుంది.

ప్రొడ్యూసర్ ఎ.ఎంరత్నం దాదాపు రూ.100కోట్లతో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. జాక్వలిన్ ఫెర్నాండేజ్ తో పాటు నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. క్రిష్ మ్యాజిక్ పనిచేసి ఈ మూవీ గనక హిట్ కొడితే మాత్రం రీ ఎంట్రీలో హ్యాట్రిక్ రికార్డును అందుకుంటాడు పవన్ కల్యాణ్. మరి ఇన్నేండ్ల తర్వాత వచ్చిన ఛాన్స్ ను అందిపుచ్చుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు మరి.
Also Read: భోళా లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్ !
