https://oktelugu.com/

OTT: ఓటీటీలు ఉన్నప్పుడు ఇక టీవీ చానెళ్లు ఎందుకు దండగ 

OTT: ఓటీటీ సంస్థలు అన్నీ నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. పైగా ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. మరి ఇప్పటికే ఎన్నో ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా మనకు టీవీ అవసరం ఉందా ? ఇది ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఈ మధ్య తరుచు గా అడుగుతున్న ప్రశ్న. ఓటీటీలు ఉన్నప్పుడు నిజంగానే టీవీ అవసరం లేదు. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 1, 2022 / 11:53 AM IST
    Follow us on

    OTT: ఓటీటీ సంస్థలు అన్నీ నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. పైగా ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. మరి ఇప్పటికే ఎన్నో ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా మనకు టీవీ అవసరం ఉందా ? ఇది ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఈ మధ్య తరుచు గా అడుగుతున్న ప్రశ్న.

    OTT Platform

    ఓటీటీలు ఉన్నప్పుడు నిజంగానే టీవీ అవసరం లేదు. దీనికి ముఖ్య కారణం డిజిటైజేషన్ పేరుతో రేట్లు పెంచేసి, ఒకప్పుడు నెలకు 200/-లో చూడగలిగే ఛానళ్లను ఇప్పుడు 500/-కు చూడాల్సి వస్తుంది. మన టీవీ లలో వచ్చే ప్రతి షోను కాని, సీరియల్ ను కానీ.. ఇప్పుడు వారి వారి ఓటీటీలో కూడా చూసేయొచ్చు. అంతేకాకుండా మనకు వీలు ఉన్నప్పుడు ప్రశాంతంగా యాడ్ బ్రేక్ లేకుండా నిరంతరాయంగా చూడవచ్చు.

    Also Read:  భోళా లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్ !

    కానీ, అందరూ వెంటనే ఓటీటీలోకి మారడం కష్టం. ఎందుకంటే పెద్దవారు లేదా అంతగా టెక్నాలజీని వాడడం రాని వారు ఈ ఓటీటీ వ్యవస్థ కంటే టీవీనే బాగుంది కదా అంటారు. మరో కారణం ఏంటంటే ఈ సౌకర్యాన్ని వినియోగించడానికి మంచి అంతర్జాల కనెక్షన్ కావాలి. మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాలం లేదు.

    కాబట్టి అంతర్జాలం వాడుతున్న వారంతా టీవీ వదిలేసి.. ఓటీటీల వైపు వెళ్లిపోవచ్చు. డబ్బు ఆదా అవుతుంది. యాడ్ ల రూపంలో వచ్చే సుత్తి తగ్గుతుంది. కాబట్టి.. నెటిజన్లు కాస్త ఆలోచించండి. అన్నిటికి మించి కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే.

    ott platform aha

    గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. ఓటీటీలు ఉన్నప్పుడు ఇక టీవీ చానెళ్లు ఎందుకు దండగ.

    Also Read: ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ నుంచి బిగ్ అప్ డేట్

     

    Tags