Pawan Kalyan : ‘ఆపరేషన్ సింధూర్'(#OperationSindhoor) అంశంపై పలువురు సినీ సెలబ్రిటీలు కొంతమంది స్పందించడం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఏ రేంజ్ లో మండిపడుతున్నారో మన అందరం సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బాలీవుడ్ ఖన్స్ త్రయం మౌనం పై నెటిజెన్స్ ఆవేశం కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan) వంటి వారి మౌనం పై అభిమానులు అసలు సహించలేకపోయారు. దేశం మీద ప్రేమ చూపని ఇలాంటి వారికా మేము ఫ్యానిజం చేసింది అంటూ ఇన్నాళ్లు ఫ్యాన్స్ గా చలామణి అయిన వారు సోషల్ మీడియా లో ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి వారికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్లే వాళ్లిద్దరూ ఎటు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఈమధ్య కాలం లో సోషల్ మీడియా ని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) బాగా అనుసరిస్తూ ఉన్నాడు.
Also Read : పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్!
నెటిజెన్స్ హీరోలు స్పందించడం లేదు అని అసహనం వ్యక్తం చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ నిన్న పవన్ కళ్యాణ్ విజయవాడ లో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ ఈమధ్య కాలం లో గమనిస్తూ ఉన్నాను. సినీ సెలబ్రిటీలు ఆపరేషన్ సింధూర్ పై స్పందించడం లేదని అంటున్నారు. సినీ సెలబ్రిటీల నుండి మీరు ఇలాంటివి ఎందుకు ఆశిస్తున్నారు ?, వాళ్ళు దేశం కోసం వెళ్లి పోరాటం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు సినిమాల్లో మాత్రమే హీరోలు, రియల్ లైఫ్ లో హీరో అంటే మన మురళీ నాయక్. 23 ఏళ్ళ చిన్న వయస్సు లో అతను దేశం కోసం వెళ్లి యుద్ధం చేసి ప్రాణాలను వదిలాడు. అతను రియల్ హీరో, అతన్ని మనం స్మరించుకుందాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియా లో భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. సినీ హీరోలుగా వాళ్ళు ఈ స్థాయికి ఎదగడానికి కారణమైనది మన ఇండియన్ ఆడియన్స్. అలాంటప్పుడు దేశానికీ కష్టమొస్తే బాధ్యాయుతంగా రెస్పాన్స్ ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఎలా? అంటూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓజీ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే . చాలా కాలం నుండి ఆయన ఈ సినిమాతో పాటు ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలను బ్యాలన్స్ లో పెట్టి ఉన్నాడు. రీసెంట్ గానే వీటిని పూర్తి చేయాలనీ సంకల్పించిన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ని పూర్తి చేశాడు. ఈ చిత్రం వచ్చే నెల 12 న విడుదల కాబోతుంది. వచ్చే నెల 10వ తేదీ లోపు ఓజీ చిత్రాన్ని కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు.
BREAKING:
"Bollywood & other celebrities are just entertainers.
Real heroes are our Army Soldiers"
– PK pic.twitter.com/POQ1xbx74v
— Manobala Vijayabalan (@ManobalaV) May 16, 2025