Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan discharged from Hospital: హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. వీడియో...

Pawan Kalyan discharged from Hospital: హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..

Pawan Kalyan discharged from Hospital: రీసెంట్ గానే అధికారులతో పాలన పరమైన చర్చలు జరుపుతున్న సమయం లో తీవ్రమైన అస్వస్థతకు గురైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ని హాస్పిటల్ కి చేర్చడం , అక్కడ పలు రకాల స్కాన్స్ చేసి సర్జరీ అత్యవసరం అని సూచించడం తో డాక్టర్లు ఆయనకు విజయవంతంగా సర్జరీ ని పూర్తి చేయడం వంటివి జరిగాయి. డాక్టర్లు వారం నుండి పది రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారని, పవన్ కళ్యాణ్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు , అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు , త్వరలోనే పవన్ కళ్యాణ్ మన ముందుకు రెట్టింపు ఉత్సాహం తో వస్తాడంటూ మెగాస్టార్ చిరంజీవి నిన్న ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఒక సందేశం అందించాడు. ఇదంతా పక్కన పెడితే సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ నవ్వుతూ హాస్పిటల్ నుండి బయటకు వచ్చే వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ వీడియో ని చూసిన తర్వాత అభిమానుల్లో కొంత ధైర్యం వచ్చింది. అందరూ పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు , ఆయన త్వరగానే కోలుకుంటాడు అని చెప్తున్నారు కానీ , అభిమానులకు ఎంతైనా సర్జరీ జరిగింది అంటే భయపడడం సర్వసాధారణమే కదా. అందుకే కాస్త కంగారుకి గురయ్యారు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యవంతం గా నడుస్తున్న వీడియో ని చూసి, మా అన్నయ్య త్వరగానే కోలుకుంటాడు అంటూ అభిమానులు ట్వీట్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి పుట్టుకతోనే సైనస్ ఉంది . ఈ సైనస్ కారణంగా ఆయన ఎన్నో ఏళ్ళ నుండి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదురుకుంటున్నాడు. ఈ సైనస్ కారణంగానే ఆయనకు కరోనా అప్పట్లో తీవ్రంగా అటాక్ చేసింది , దీని నుండి ఆయన కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. అప్పుడప్పుడు సైనస్ కారణంగా ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇబ్బందికి శాస్వత పరిష్కారం ఈ సర్జరీ ద్వారా దొరికింది అనుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలనాపరంగా ఎంత బిజీ గా ఉంటున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ రోజు అధికారులతో సమీక్ష సమావేశం చేయడం , పలు కీలకమైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఆయన దినచర్య. ఇవి కాకుండా సినిమాల విషయం లో కూడా ఆయన ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. త్వరలోనే ఆయన ఓజీ 2 మూవీ ని ప్రారంభించబోతున్నాడు. అదే సమయం లో సురేందర్ రెడ్డి తో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇవి రెండు వచ్చే రెండు నెలల్లోనే పారంభం కాబోతున్నాయి. ఈలోపు ఆయన సంపూర్ణ ఆరోగ్య వంతుడు అవుతాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular