Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other Show Controversy: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' లో టాప్...

Mad For Each Other Show Controversy: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ లో టాప్ జంటకు అన్యాయం..ఇది రియాలిటీ షో కాదు అనడానికి ఇదే ఉదాహరణ..

Mad For Each Other Show Controversy: రియాలిటీ షో అని అంటారు , కానీ తీరా అక్కడ చూస్తే స్క్రిప్ట్ ప్రకారమే షోలు నడుపుతారు , ఈ మాత్రం దానికి ఎందుకు రియాలిటీ షో అని ప్రచారం చేయడం అంటూ సోషల్ మీడియా లో రీసెంట్ గా మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్'(Mad For Each Other) షో పై విమర్శల వర్షం కురుస్తోంది. మంచిగా గేమ్స్ ఆడే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతోంది […]

Mad For Each Other Show Controversy: రియాలిటీ షో అని అంటారు , కానీ తీరా అక్కడ చూస్తే స్క్రిప్ట్ ప్రకారమే షోలు నడుపుతారు , ఈ మాత్రం దానికి ఎందుకు రియాలిటీ షో అని ప్రచారం చేయడం అంటూ సోషల్ మీడియా లో రీసెంట్ గా మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్'(Mad For Each Other) షో పై విమర్శల వర్షం కురుస్తోంది. మంచిగా గేమ్స్ ఆడే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతోంది అంటూ విమర్శిస్తున్నారు నెటిజెన్స్. నిన్న సంధ్య , బ్రిటో జంట ఎలిమినేట్ అవ్వడం మ్యాన్షన్ లోని జంటలకు ఎంత బాధ కలిగించిందో, ఆడియన్స్ కి కూడా అంతే బాధ కలిగించింది. ప్రక్రియ ప్రకారమే ఈ ఎలిమినేషన్ జరిగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ ప్రక్రియ అందరి కంటెస్టెంట్స్ కి సమానంగా ఉండాలి. గత వారం ఏమి జరిగిందో ఈ షో ని చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అయ్యే ఉంటుంది.

నటరాజ్ మాస్టర్ షో ఫార్మటు పైన మాత్రమే కాదు , జడ్జీలపై, కంటెస్టెంట్స్ పై నోరు జారాడు. నాకు ఈ షో వద్దు బాబోయ్ , నేను బయటకు వెళ్ళిపోతాను అని ఆయన ఎంత బ్రతిమిలాడినా జడ్జీలు ఒప్పుకోలేదు. షో ఫార్మటు ప్రకారం ఫైనల్ బ్యాటిల్ ఆడి ఓడిపోతే వెళ్లిపోండి అని అన్నారు జడ్జీలు. వాళ్ళ గోల భరించలేక నటరాజ్ మాస్టర్ ఫైనల్ బ్యాటిల్ లో పాల్గొంటాడు , కానీ ఓడిపోతాడు. ఫార్మటు ప్రకారం ఎలిమినేట్ అవ్వాలి , కానీ అది జరగలేదు, ఆ వారానికి ‘నో ఎలిమినేషన్’ ప్రకటించారు. అలా ఎలిమినేట్ అవ్వాల్సిన నటరాజ్ – నీతూ జంట సేవ్ అయ్యింది. కానీ నిన్న మాత్రం సంధ్య – బ్రిటో ని ఫార్మటు ప్రకారం ఎలిమినేట్ చేశారు. నిన్నటి నుండి ఆడియన్స్ ఓటింగ్ ని ప్రవేశ పెట్టారు. అలాంటప్పుడు ఈ వారం కూడా ఎలిమినేషన్ పెట్టకుండా , ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వచ్చే వారం నుండి ఎలిమినేషన్స్ చేయొచ్చు కదా.

ఎందుకు ఇలా చేశారు?, ఇది కచ్చితంగా అన్యాయమే అంటూ నెటిజెన్స్ గట్టిగా తమ స్వరం వినిపిస్తున్నారు. నిజానికి సంధ్య – బ్రిటో జంట చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఈ వారం వాళ్లకు అదృష్టం కలిసి రాక డేంజర్ జోన్ లోకి వచ్చారు , కానీ ఇప్పటి వరకు వీళ్ళు ఒక్కసారి కూడా డేంజర్ జోన్ లోకి రాలేదు. అలాంటి జంటకు ఒక్క అవకాశం ఇచ్చి ఉండుంటే ఫినాలే వరకు కొనసాగేవారేమో కదా, ఎందుకు అలాంటి అవకాశం ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. మీకు కావాల్సిన వాళ్ళని హౌస్ లో పెట్టుకుంటున్నారు , అవసరం లేదని అనిపించేవాళ్లను తరిమేస్తున్నారు , ఈ మాత్రం దానికి రియాలిటీ షో ఎందుకు , ఆడియన్స్ ఓటింగ్ ఎందుకు అంటూ నిలదీస్తున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper