Harish Shankar: హరీశ్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి సన్నద్ధం అయ్యాడు. అయితే, ఈ సినిమా గురించి గత కొన్ని నెలలుగా ఎలాంటి అప్ డేట్ లేదు. దాంతో పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ పై సీరియస్ అవుతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో హరీష్ కూడా వారి పై సీరియస్ అవుతూ ఉంటాడు. మొత్తమ్మీద సోషల్ మీడియాలో హరీష్ చాలా సీరియస్ గా ఉంటాడని ఈ సంఘటనలను బట్టి అర్ధం అవుతుంది.
కాగా ఆ సీరియస్ నెస్ మరోసారి బయట పడింది దర్శకుడు హరీష్ శంకర్ ఓ నెటిజన్ పై సడెన్ గా ఫైరయ్యాడు. ఇంతకీ ఎందుకు ఫైర్ అయ్యాడు అంటే.. ఒమిక్రాన్‌తో ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అలా అని నిర్లక్ష్యం చేయొద్దని, ఓ వైద్యుడి వీడియోని హరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక హరీష్ షేర్ చేసిన ఆ వీడియోని కరెక్ట్ గా అర్ధం చేసుకోకుండా ఓ నెటిజన్ ప్రతికూలంగా స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు.
Also Read: హీరో శింబుకు అరుదైన పురస్కారం.. ఫ్యాన్స్ ఖుషీ..!
నెటిజన్ పెట్టిన పోస్ట్ ఏమిటంటే.. ‘మీరు ప్రజల్లో భయాన్ని తగ్గిస్తున్నారు ఏమిటి ? భయం పోతే.. ప్రజలంతా విచ్చలవిడిగా తిరుగుతారు, అప్పుడు కరోనా కేసులు ఎక్కువ అవుతాయి’ అంటూ ఆ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. అయితే, అతని మెసేజ్ ఫై హరీష్ శంకర్ రియాక్ట్ అవుతూ.. ‘జనాలకి కొద్దిగా అయినా పాజిటివ్ అంశాలను చెప్పనివ్వండి, మీ స్టుపిడ్స్ అంతా ఇంతేనా ?’ అంటూ మెసేజ్ పెట్టాడు. మొత్తానికి నెటిజన్ పై గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఫైర్ అంటూ మళ్ళీ హరీష్ వార్తల్లో నిలిచాడు.
Also Read: నాతో కంటే రష్మికతో చేయడమే కరెక్ట్ – సమంత
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Pawan kalyan director serious on netizens
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com