Anupama Parameswaran: యంగ్ మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’కి కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆ మధ్య తెలుగులో అనుపమకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. కానీ, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. రాకపోయినా.. మీడియం రేంజ్ హీరోలకు బెటర్ ఆప్షన్ గా అనుపమ ఇప్పటివరకు నిలుస్తూ వచ్చింది. దాంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఎలాగోలా కెరీర్ ను బాగానే మెయింటైన్ చేస్తూ వస్తోంది.

అయితే, అనుపమ ఎన్నడూ ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయడం, అనవసరమైన వివాదాలలో దూరడం లాంటివి చేయలేదు. పైగా ఎప్పుడు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ సింపుల్ గా ఉంటుంది. నిజానికి ఆమె గ్లామర్ షోకు దూరంగా ఉంది కాబట్టే.. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రాలేదు అనే టాక్ ఉంది. అయినప్పటికీ అనుపమ మాత్రం తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు బాగానే ఆకట్టుకుంది.
Also Read: నాతో కంటే రష్మికతో చేయడమే కరెక్ట్ – సమంత
పైగా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటూ.. నిత్యం తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా అనుపమకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. అనుపమ హీరోయిన్ గా నటించిన రౌడీ బాయ్స్ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. పైగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
కాగా ట్రైలర్ లో అనుపమ కిస్ సీన్స్ షాట్స్ ఉన్నాయి. ఆ కిస్ షాట్స్ చూసిన అభిమానులు సడెన్ గా అనుపమ పై విరుచుకుపడుతున్నారు. ఇన్నాళ్లు పద్దతిగా కనిపించి ఇలా రెచ్చిపోతావా ? అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే అనుపమ ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్ కిస్ సీన్ లో నటించింది. అందుకే నెటిజన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే, కొన్ని ఆఫర్లను అందుకున్న అనుపమా, స్టార్ డమ్ రావాలంటే స్టార్ హీరోల సినిమాల్లోనే నటించాలని ఫిక్స్ అయింది.
అందుకే కాస్త ఎక్స్ పోజింగ్ విషయంలో పరిధి దాటాలని నిర్ణయించుకుంది. పైగా విజయ్ దేవరకొండ తో రెగ్యులర్ గా టచ్ లోకి వెళ్తుందట. విజయ్ కూడా హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాను అని మాట ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ విజయ్ దేవరకొండ సినిమాలో తన నటనతో గాని అనుపమ మెప్పించగలిగితే, ఇక ఆమె దశ తిరిగినట్టే.
Also Read: ఛార్మిని ఆటపట్టించిన బాలయ్య.. చూసి తీరాల్సిందే..!
[…] Harish Shankar: హరీశ్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి సన్నద్ధం అయ్యాడు. అయితే, ఈ సినిమా గురించి గత కొన్ని నెలలుగా ఎలాంటి అప్ డేట్ లేదు. దాంతో పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ పై సీరియస్ అవుతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో హరీష్ కూడా వారి పై సీరియస్ అవుతూ ఉంటాడు. మొత్తమ్మీద సోషల్ మీడియాలో హరీష్ చాలా సీరియస్ గా ఉంటాడని ఈ సంఘటనలను బట్టి అర్ధం అవుతుంది. […]
[…] Atithi Devobhava: ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘అతిధి దేవోభవ’. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే..చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నట్టు ఉంది పరిస్థితి. అసలు ఈ ‘అతిథి దేవో భవ’కి రూ.1.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.28 కోట్లును మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. పాపం బయ్యర్లు ఫుల్ గా బుక్ అయ్యారు. నిర్మాతలు కూడా ఈ సినిమాతో భారీగానే నష్టపోయారు. […]