Paritala Shriram: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఇప్పటికే టీడీపీ తన స్థానాలు ఖరారు చేసుకుంటోంది. ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో నుంచి పోటీ చేయాలనేదానిపై ఓ అంచనాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల కుటుంబం తన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అధినేత చంద్రబాబుతో చర్చించకుండానే మంతనాలు సాగిస్తోంది. ఇప్పటి నుంచే వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నారు.

పెనుకొండ నియోజకవర్గం మీద మంచి పట్టుంది. ఇక్కడ నుంి 1983 నుంచి ఇప్పటి దాకా టీడీపీ రెండు సార్లు మాత్రమే ఓటమి పాలైంది. మిగతాసార్లు విజయం సాధించిందంటే టీడీపీ స్థానమేంటో అర్థమవుతోంది. 2009లో ఇది ఎస్సీ రిజర్వ్ కావడంతో వైసీపీ జెండా ఎగరేసింది. మంత్రి శంకరనారాయణ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read: ప్చ్.. ఇన్నాళ్లు పద్ధతిగా ఉండి.. ఇప్పుడు రెచ్చిపోతుంది !
దీంతో పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గానికి వలస వెళ్లింది. ఇక్కడి నుంచి పరిటాల సునీత రెండు సార్లు విజయం సాధించి తన పట్టు నిరూపించుకున్నారు. 2019లో శ్రీరామ్ ను ఇక్కడి నుంచి పోటీ చేయించినా పరాజయం పాలయ్యారు. 25 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ప్రకాశ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.దీంతో రాప్తాడులో కూడా సమీకరణలు మారుతున్నాయి.
అందుకే పరిటాల కుటుంబం తన వ్యూహాన్ని మార్చుకుంది. ఈసారి ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. దీంతో కొద్ది రోజులుగా శ్రీరామ్ ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంల పర్యటిస్తూ తాను ఇక్కడ నుంచే బరిలో దిగుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ధర్మవరం అయితేనే గెలుపు సాధ్యమవుతుందని పక్కా ప్రణాళిక రచిస్తున్నారు.
Also Read: ఛార్మిని ఆటపట్టించిన బాలయ్య.. చూసి తీరాల్సిందే..!
[…] Bandla Ganesh: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజా రాజకీయ, సామాజిక, సినిమాతో పాటు ఇతర విషయాలపైన స్పందిస్తుంటారు. తాజాగా వైసీపీ నేతలు చేసిన రెడ్డి కామెంట్స్‌కు బండ్ల గణేశ్ వాళ్ల దిమదిరిగిపోయే కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు బండ్ల గణేశ్ ను తెగ పొగిడేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. […]

[…] Isha Chawla: కరోనా బారిన పడుతున్న , హీరోయిన్ల లిస్ట్ లో చేరింది ఇషా చావ్లా. పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. ‘ప్రేమ కావాలి’ అనే సినిమా ద్వారా నేను ఉన్నాను అంటూ హీరోయిన్ గా పరిచయం అయింది. ఇషా చావ్లాలో మంచి అభినయం ఉంది. ఇక అందం ఉంది కాబట్టే ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. చివరకు ఇలా కరోనా బాధితురాలిగా వార్తలకెక్కింది. […]