Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా సక్సెస్ సాధించాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. డైరెక్టర్ ని ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అంటారు. అంటే అన్ని క్రాఫ్ట్ లకి ఆయనే అధిపతి అని అర్థం. అన్ని క్రాఫ్ట్ ల మీద ఆయనకి అవగాహన ఉండాలి. అలాంటప్పుడే ప్రతి క్రాఫ్ట్ నుంచి ఆయన బెస్ట్ ఔట్ పుట్ ని రాబట్టుకొగలుగుతాడు. ఒక సినిమా విషయంలో నటులకంటే కూడా దర్శకులు యొక్క బాధ్యత సినిమా మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు అన్ని దర్శకుడే చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఒక సినిమా సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన దర్శకుడే భాధ్యత వహించాల్సి ఉంటుంది…
ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ నటుడిగా సూపర్ సక్సెస్ అయ్యాడు. కానీ దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఆయన డైరెక్టర్ గా మారి చేసిన జానీ సినిమా కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్లే ఆ సినిమా పోయిందంటు అప్పట్లో విమర్శకులు సైతం ఆ సినిమా మీద కొన్ని విమర్శలనైతే చేశారు.
ముఖ్యంగా ఈ సినిమా ఆడకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాని స్లో నరేషన్ లో తీసుకెళ్లాడు. అలా కాకుండా స్క్రీన్ ప్లే ను కొంచెం ఫాస్ట్ గా రాసుకుంటే బాగుండేది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బాక్సింగ్ చేసే సీన్ లో డైరెక్షన్ అంత బాగుండదు. ఇక ఈ సినిమాలో ఆయన కాకుండా వేరే కొత్త హీరో ఎవరైనా చేసి ఉంటే వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ కథ అనేది సరిపోయేది. దానివల్ల సినిమా సక్సెస్ అయ్యేది. అప్పట్లో ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో ఆయన క్రేజ్ తారాస్థాయిలో ఉంది.
అలాంటి సమయంలో ఆయన ఈ సినిమాని చేయడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కానీ సినిమా మాత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో సినిమా డైరెక్షన్ చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే మాత్రం తప్పకుండా మంచి సక్సెస్ ని అందుకునేవాడు…