Pawan Kalyan : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..?, ఇతను దేశ రాజకీయాలను ప్రస్తుతం ఒక కుదుపు కుదిపేస్తున్నాడు, ఎక్కడ చూసినా ఈయన గురించే చర్చ. సినీ ఇండస్ట్రీ ద్వారా కోట్లాది మంది వీరాభిమానులను సంపాదించుకున్నాడు. ఇతని పేరు వింటే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన్ని అభిమానులు ఒక దేవుడిగా కొలుస్తారు. ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ని చూసి తోటి హీరోలు కూడా అసూయ పడుతుంటారు. ఎన్ని ఫ్లాప్స్ పడినా తరగని క్రేజ్, హిట్టు కొట్టాడంటే ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వుద్ది. ఒక్క రికార్డు కూడా మిగలదు, యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ బుడ్డోడికి టాక్ తో సంబంధం లేకుండా కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి.
ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత గుర్తు పట్టకుండా ఎలా ఉంటారు, అతను మరెవరో కాదు, మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడిగా కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన, నేడు రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగిన అతని తీరు ఎంతో ఆదర్శప్రాయం. ఈ స్థాయికి చేరుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎన్ని కష్టాలు, అవమానాలు,తిట్లు పడ్డాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క పెద్ద మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి ఎవరొచ్చినా కూడా వాళ్ళ కెరీర్ చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ మాత్రం ఎన్నో ఒడిదుడుగుల నడుమ సాగింది. వ్యక్తిగత జీవితం లోనూ, సినీ జీవితం లోనూ, రాజకీయ జీవితం లోనూ, ఆయన ఎదురుకున్నని కష్టాలు ఏ హీరో కూడా ఎదురుకోలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఎలాంటి సందర్భం వచ్చినా ఆయన అభిమానులు మాత్రం ఆయన్ని వదలలేదు. దెబ్బ తగిలే కొద్దీ అభిమానం పెంచుకున్నారు.
బలంగా నిలబడ్డారు, వాళ్ళ సహాయసహకారాలతోనే నేడు దేశం గర్వించ దగ్గ నాయకులలో ఒకరిగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తి నుండి అతనొక ‘సునామి’ అని అనిపించుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచాడు. ప్రస్తుతం ‘సనాతన ధర్మం రక్షకుడు’ గా పవన్ కళ్యాణ్ ని దేశం మొత్తం కీర్తిస్తుంది. మన మతాన్ని పూజించు, ఇతర మతాలను గౌరవించు అనే సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ పాటించినట్టుగా ఏ నాయకుడు పాటించలేదు. పవన్ కళ్యాణ్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి పాన్ ఇండియన్ మూవీ విడుదల కాలేదు. కానీ తన సొంత కష్టం మీద నిర్మించుకున్న జనసేన అనే కోట ద్వారా దేశం లోనే పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగాడు. భవిష్యత్తులో ఈయన ఇంకా ఏ స్థాయికి చేరుకుంటాడో చూడాలి. రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి గా కూడా ఆయన్ని మనం చూడొచ్చు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన తల్లి అంజనా దేవి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. ఆ విశేషాలను మీరు కూడా ఈ క్రింది వీడియో లో చూడండి.