WhatsApp Features : మొబైల్ ఉన్న వారు వాట్సాప్ లేకుండా ఉండలేరు. పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికి వాట్సాప్ అత్యవసరంగా మారింది. అయితే వాట్సాప్ కు యూజర్లు విపరీతంగా పెరిగిపోవడంతో వారి భద్రతను కాపాడేందుకు దీని మాతృ సంస్థ అయినా బెటా కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే పలు ప్రైవసీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారులకు రక్షణ కల్పిస్తోంది. అంతేకాకుండా వారిని ఆకర్షించేందుకు కొన్ని వినూత్న ప్రయోగాలు కూడా చేస్తుంది. తాజాగా వీడియో కాల్స్ లో కొత్త ఫీచర్ ను తీసుకురాబోతతుంది. దీనికి సంబంధించిన పొటోలను రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ వివరాల్లోకి వెళితే…
వాట్సాప్ ఒకప్పుడు కేవలం మెసేజ్ పంపించుకోవడానికే పరిమితంగా ఉండేది. ఆ తరువాత క్రమంలో ఫొటోలు, వీడియోలతో పాటు భారీ సైజు ఉన్న ఫైల్స్ ను పంపించుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో చాలా మంది మెయిల్స్ కంటే వాట్సాప్ నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ లో ఫొటోస్, వీడియోలు మాత్రమే పంపించడం కాకుండా కాల్స్ కూడా చేసే అవకావం ఉందని అందరికీ తెలుసు. చాలా మంది సాధారణ కాల్స్ కంటే వాట్సాప్ కాల్స్ ను చేస్తున్నారు. విదేశాల్లో ఉండేవారితో మాట్లాడడానికి వాట్సాప్ వీడియో కాల్స్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
మొబైల్ లో డేటా ఉంటే చాలు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తమకు కావాల్సిన వారితో మాట్లాడవచ్చు. అంతేకాకుండా తమ యోగ , క్షేమాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియో కాల్ ను ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఎవరికైనా వీడియో కాల్ చేసినప్పుడు మీరు ఎలాంటి మూడ్ లో ఉన్నారో కొన్ని స్టిక్సర్స్, లొకేషన్లను సెట్ చేసుకోవచ్చు. సాధారణంగా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మాటల ద్వారా చెబుతారు. కానీ ఒక్కోసారి వారి లోకేషన్ బట్టి క్లియర్ గా ఉండదు.
కానీ కొత్త ఫీచర్ లో రద్దీగా ఉండే ప్రదేశాల్లో, కాఫీ షాపుల్లో, బీచ్ లో ఉన్నట్లు సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీడియో కాల్ చేసినప్పుడు బ్యాగ్రౌండ్ లో బర్డ్ ప్లయింగ్, లేదా వార్మ్ వంటి వాటిని సెట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం 10 రకాల బ్యాగ్రౌండ్ లను వాట్సాప్ లో అందుబాటులో ఉంచనున్నారు. వీటి ద్వారా తమ మూడ్ గురించి చెప్పుకోవచ్చు. వీడియో కాల్ చేసినప్పుడు ఎదుటి వారిని ఆకర్షించడానికి, తమ గురించి చెప్పడానికి కొన్ని స్టికర్లను కూడా జోడించవచ్చు.
అయితే ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోనే ఉంది. దీనిని పూర్తిగా అభివృద్ధి చేసిన తరువాత అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని పిక్ లను రిలీజ్ చేశారు. ముందుగానే వినియోగారులను సర్ ప్రైజ్ చేయడానికి ఇలా బయటపెట్టినట్లు వాటీబా ఇన్ఫో తన బ్లాగ్ లో తెలిపింది. మరో వారం రోజుల్లో ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశ ఉన్నట్లు తెలిపింది.