My Dear Markandeya Song Making Video: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై అంచనాలను అమాంతం పెంచేలా చేసాయి. టీజర్ మరియు మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా టీజర్ ని చూసి అయితే ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోయారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూసాము అంటూ సోషల్ మీడియా లో ట్వీట్స్ వేశారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన రెండవ లిరికల్ వీడియో సాంగ్ ని ఈ నెల 15 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు నిన్ననే ఒక అధికారిక ప్రకటన చేసారు. ‘జానవులే’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ ఆల్బం కి పెద్ద హిట్ అవుతుందని టాక్.
ఇక పోతే కాసేపటి క్రితమే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘మై డియర్ మార్కండేయ’ కి సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు తో అలా ఫన్నీ గా డ్యాన్స్ చేస్తూ, అల్లరి చెయ్యడం అభిమానులకు బాగా నచ్చింది. వాళ్ళ మధ్య అలాంటి చిలిపి పనులు జరుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే అవి ప్రత్యక్షంగా చూసే అదృష్టం మాత్రం అభిమానులకు ఈ సినిమా ద్వారానే దక్కింది.
ఈరోజు విడుదలైన మేకింగ్ వీడియో లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూస్తుంటే, సినిమాలో వీళ్లిద్దరి కాంబినేషన్ సన్నివేశాలు అదిరిపోతాయి అని అర్థం అవుతుంది. చూడాలిమరి ఈ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ ని సృష్టిస్తుంది అనేది. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.