Anasuya Bharadwaj: స్టార్ యాంకర్ అనసూయ సోషల్ మీడియా ఫ్రీక్. తనకు సంబంధించిన ప్రతి విషయం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఫ్యామిలీ ఫోటోస్, టూర్ డైరీస్, కొత్త ప్రాజెక్ట్ అప్డేట్స్, గ్లామరస్ ఫోటో షూట్స్ అభిమానులకు షేర్ చేస్తారు. ఇక సదరు పోస్ట్స్ పై వచ్చే కామెంట్స్ కి స్పందిస్తారు. ఎవరైనా హద్దులు దాటి కామెంట్స్ చేస్తే తిరిగి ఇచ్చి పడేస్తారు. అనసూయతో అనుచితంగా ప్రవర్తించి జైలుపాలైన యువకులు ఎందరో ఉన్నారు. అనసూయ చాలా ఇండిపెండెంట్ అండ్ బోల్డ్. ఎవరో ఏదో అన్నారని నీ మెంటాలిటీ మార్చుకోకూడదు అంటుంది.
సోషల్ మీడియాలో ఎందరు హేట్ చేసినా పట్టించుకోరు. పైగా హేటర్స్ కుళ్ళుకునేలా కవ్వించే పోస్ట్స్ పెడుతుంది. తాజాగా అనసూయ లుక్ బోల్డ్ గా ఉంది. అమెరికా వెళ్లిన అనసూయ కొన్ని గ్లామరస్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెట్టారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ వాషింగ్టన్ స్టేట్ లో ఉన్నారు. అదే విషయాన్ని తన పోస్ట్ లో తెలియజేశారు. ప్రొఫెషన్ లో భాగంగా అనసూయ పలు నగరాల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు.
యాంకరింగ్ మానేసిన అనసూయ నటిగా సక్సెస్ అయ్యారు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అనసూయ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2లో కీలక రోల్ చేస్తున్నారు. దాక్షాయణిగా ఆమె నెగిటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్ప 2 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుందని సమాచారం.
బుల్లితెర ఆడియన్స్ అనసూయ బాగా మిస్ అవుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ప్రేక్షకులకు ఆమె దూరమయ్యారు. ఆమె రీ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే యాంకరింగ్ పట్ల తనకు ఆసక్తి లేదని అనసూయ చెప్పకనే చెప్పింది. టిఆర్పీ కోసం చీప్ ట్రిక్స్ కి మేకర్స్ పాల్పడుతున్నారు. అవి తనకు నచ్చడం లేదని అనసూయ అన్నారు. జబర్దస్త్ వేదికగా పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ ఈ స్థాయికి ఎదిగారు. అనసూయ గ్లామరస్ యాంకర్ గా కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. అనసూయ డ్రెస్సింగ్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు.