MY Dear Markandeya Song: రోజుకి 2 మిలియన్ వ్యూస్..యూట్యూబ్ ని దున్నేస్తున్న ‘మై డియర్ మార్కండేయ’ మొదటి పాట!

ఇప్పుడు అందరి చూపు ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో ది అవతార్' చిత్రం పైనే ఉంది. ఈ సినిమానే ఇండస్ట్రీ ని ఆడుకుంటుంది అనే నమ్మకం తో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రాగా, మొన్న విడుదల చేసిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ మొదటి రోజు కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చింది.

Written By: Vicky, Updated On : July 13, 2023 6:37 pm

MY Dear Markandeya Song

Follow us on

MY Dear Markandeya Song: గత కొంతకాలం నుండి టాలీవుడ్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక కేవలం చిన్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడం వల్ల వస్తున్నా కలెక్షన్స్ తో ఇండస్ట్రీ నడుస్తుంది. విడుదలైన పెద్ద సినిమాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇక రాక రాక వచ్చిన స్టార్ హీరో చిత్రం ‘ఆదిపురుష్’ భారీ డిజాస్టర్ గా నిలిచి బయ్యర్స్ కి 60 కోట్ల రూపాయిల నష్టాన్ని మిగిలించింది.

ఇప్పుడు అందరి చూపు ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం పైనే ఉంది. ఈ సినిమానే ఇండస్ట్రీ ని ఆడుకుంటుంది అనే నమ్మకం తో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రాగా, మొన్న విడుదల చేసిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ మొదటి రోజు కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఫ్యాన్స్ కి మొదట్లో ఈ పాట పెద్దగా నచ్చలేదు కానీ, ఆ తర్వాత రెండవ రోజు నుండి మాత్రం ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రోజుకి సగటున రెండు మిలియన్ వ్యూస్ కి తక్కువ కాకుండా వస్తున్నాయి, అలా నాలుగు రోజులకు గాను ఈ పాటకి కోటి వ్యూస్ వచ్చాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తే కచ్చితంగా ఈ పాట లాంగ్ రన్ లో వంద మిలియన్ వ్యూస్ సాదిస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.

మరి ఆ రేంజ్ కి రీచ్ అవుతుందో లేదో చూడాలి. కాసేపటి క్రితమే ఈ పాటకి సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పాట మొత్తం మీద ఫుల్ జోష్ మీద ఉన్నట్టుగా అనిపించింది. లుక్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి, కచ్చితంగా ఈ పాట ఆన్ స్క్రీన్ మీద ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ లాగా ఉంటుందని అంటున్నారు మేకర్స్. చూడాలి మరి.