https://oktelugu.com/

Gamyam Movie: ‘గమ్యం’ చిత్రం లో అల్లరి నరేష్ పాత్రని మిస్ చేసుకున్న హీరో అతనేనా..? ఎలాంటి ఛాన్స్ మిస్ అయ్యిందో పాపం!

అటు శర్వానంద్ కెరీర్ లోను, ఇటు అల్లరి నరేష్ కెరీర్ లోను మైలు రాయిగా నిల్చింది ఈ చిత్రం. ముఖ్యంగా గాలి శ్రీను గా చేసిన అల్లరి నరేష్ పాత్ర ప్రతీ ప్రేక్షకుడిని కదిలించింది. అప్పటి వరకు ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చిన అల్లరి నరేష్, ఈ పాత్ర ద్వారా వెక్కిళ్లు పెట్టి ఏడ్చేలా చేసాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తోనే ఆయన అప్పుడప్పుడు అలాంటి పాత్రలు చాలానే చేసుకుంటూ వచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : July 13, 2023 / 06:49 PM IST

    Gamyam Movie

    Follow us on

    Gamyam Movie: ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధా కృష్ణ తెరకెక్కించిన ‘గమ్యం’ సినిమాకి టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక్కమాటలో చెప్పాలి అంటే జీవితానికి సరైన అర్థాన్ని వెండితెర మీద ఆవిష్కరించాడు డైరెక్టర్ క్రిష్. శర్వానంద్ , అల్లరి నరేష్ లు హీరోలుగా కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అటు క్లాసిక్ అని అనిపించుకుంటూనే, మరో పక్క కమర్షియల్ గా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

    అటు శర్వానంద్ కెరీర్ లోను, ఇటు అల్లరి నరేష్ కెరీర్ లోను మైలు రాయిగా నిల్చింది ఈ చిత్రం. ముఖ్యంగా గాలి శ్రీను గా చేసిన అల్లరి నరేష్ పాత్ర ప్రతీ ప్రేక్షకుడిని కదిలించింది. అప్పటి వరకు ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చిన అల్లరి నరేష్, ఈ పాత్ర ద్వారా వెక్కిళ్లు పెట్టి ఏడ్చేలా చేసాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తోనే ఆయన అప్పుడప్పుడు అలాంటి పాత్రలు చాలానే చేసుకుంటూ వచ్చాడు.

    అయితే ఈ చిత్రం లోని అల్లరి నరేష్ పాత్రకి ముందుగా ప్రముఖ కమెడియన్ సునీల్ ని తీసుకుందాం అనుకున్నాడట డైరెక్టర్ క్రిష్. ఈ విషయంపై ఆయనని కలిసి కథని కూడా వినిపించాడట. సునీల్ కి బాగా నచ్చింది కానీ, ఆ సమయం లో ఆయన అప్పటికే నాలుగు సినిమాల్లో హీరోగా, రెండు సినిమాల్లో కమెడియన్ చెయ్యడానికి డేట్స్ ఇచ్చేసి ఉన్నాడట. ఆ డేట్స్ లో ఏదైనా షెడ్యూల్ వాయిదా పడితే మీ సినిమాకి డేట్స్ ఇస్తానని అన్నాడట సునీల్.

    దీంతో డైరెక్టర్ క్రిష్ కి ఈ పాత్ర అల్లరి నరేష్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందట. అప్పటికే అల్లరి నరేష్ కితకితలు, బ్లేడ్ బాబ్జీ , బెండు అప్పారావు , ఇలా వరుసగా హిలేరియస్ కామెడీ ఎంటెర్టైనెర్స్ తో జనాల్లో కామెడీ హీరో అనే ముద్ర ని బలంగా వేసేసుకున్నాడు. ఎలాగో ఈ పాత్రకి ఎప్పుడూ నవ్వించే ఆర్టిస్టుని పెట్టుకోవాలి అని అనుకున్నాము కాబట్టి అల్లరి నరేష్ సరిగ్గా సరిపోతాడని భావించి ఆయనని సంప్రదించారట. సింగల్ సిట్టింగ్ లోనే స్టోరీ ఓకే అయిపోయింది, ఇక ఆ తర్వాత ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికీ తెలిసిందే.