Bro Movie Collections: పవన్ కళ్యాణ్ బ్రోకి ఊహించని వసూళ్లు… ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే!

బ్రో సినిమా దాదాపు 96 కోట్లు కలెక్షన్స్ సాధిస్తే సినిమా తీసుకున్న బయ్యర్లు లాభాలు పొందుతారు. ఈ కోణంలో చూసుకుంటే మొదటి రోజు బాగానే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తుంది.

Written By: Shiva, Updated On : July 29, 2023 11:07 am

Bro Movie Collections

Follow us on

Bro Movie Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సముద్రఖని దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా తొలి రోజే మంచి వసూళ్లు సాధించినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. తమిళ సినిమా వినోదయ సితం కు రీమేక్ గా తెరకెక్కించారు. తమిళంలో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులోకి వచ్చేసరికి దాదాపు 100 కోట్లు పైగా ఖర్చు పెట్టారు.

పవన్ కళ్యాణ్ కి రెమ్యూనరేషన్ రూపంలో దాదాపు 50 కోట్లు, మిగిలిన నటీనటులకు షూటింగ్ కి మరో 50 కోట్లు అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు కొన్ని చోట్ల సొంతంగా రిలీజ్ చేశారు. నైజాంలో ఈ సినిమా 30 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. సీడెడ్‌లో 13 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 9.5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లా హక్కులు 6.4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా 5.4 కోట్లు, గుంటూరు జిల్లాలో 7.3 కోట్లు, కృష్ణా జిల్లాలో 6 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3.5 కోట్ల రూపాయలతో కలిపి 80 కోట్ల అలాగే ఓవర్శిస్ 10 కోట్లు తెలుగేతర రాష్ట్రాల్లో మరో 5 కోట్లకు కలిపి మొత్తం 95 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.

బ్రో సినిమా దాదాపు 96 కోట్లు కలెక్షన్స్ సాధిస్తే సినిమా తీసుకున్న బయ్యర్లు లాభాలు పొందుతారు. ఈ కోణంలో చూసుకుంటే మొదటి రోజు బాగానే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తుంది. అమెరికాలో ప్రీమియర్లను 256 లోకేషన్లలో ప్రదర్శించారు. యూఎస్‌లో 550K డాలర్లకుపైగా, కెనడాలో 70 వేల డాలర్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో మొత్తంగా 650K వసూళ్లను రాబట్టింది. నైజాంలో 8 కోట్లు, ఏపీలో 15 కోట్లు , కర్ణాటక, తమిళనాడు, మిగితా రాష్ట్రాల్లో కలిపి 5 కోట్లు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు 35 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

కాకపోతే ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో రివ్యూస్ రాలేదు. దీంతో కలెక్షన్ విషయంలో కొంచెం ఇబ్బందులు తప్పకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా కావటంతో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి కాబట్టి ఈ వీకెండ్ ఎలాంటి ఇబ్బంది లేదు. వీకెండ్ ముగిసేలోపు దాదాపు 60 నుంచి 70 కోట్లు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మండే టెస్ట్ లో సినిమా పాస్ అయితే ఈజీగా 96 కోట్లు వసూళ్లు చేయటం పెద్ద కష్టమేమి కాదు.