Disney+ Hotstar: భారత్ లో ఓటీటీల హవా పెరిగిపోతుంది. తక్కువ మనీతో ఇంట్లోనే కటుుంబ సభ్యులతోసినిమా చూసే అవకాశాన్ని కొన్ని ఓటీటీ సంస్థలు కల్పించడంతో చాలా మంది వీటికి అడిక్ట్ అయ్యారు. కొంతమంది అయితే సంత్సరాలుగా థియేటర్లోకి వెళ్లలేని వారు ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. అయితే రానున్న రోజుల్లో ఓటీటీ వినియోగంలో పరిమితులు విధించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే Netflix తమ వినియోగదారులకు కొన్ని కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటి వరకు 10 కి పైగా పాస్ వర్డ్ షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ ఇక నుంచి ఇద్దరికి మాత్రమే లాగిన్ అయ్యే విధంగా నిబంధనలు తేనుంది. జూలై 20 నుంచి ఇవి వర్తిస్తాయి. అయితే డిస్నీ+హాట్ స్టార్, జియో సంస్థలు ఏమంటున్నాయి? అవి కూడా Netflix బాటలోనే వెళ్లున్నాయా?
Netflix వినియోగదారులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. కానీ భారత్ లోనూ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల్లో ఒక్కరు సబ్ స్క్రిప్షన్ తీసుకొని ఎక్కువ మంది పాస్ వర్డ్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో కొత్త సబ్ స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి తోడు భారత్ లో Netflix కు డిస్నీ+హాట్ స్టార్, జియో, అమెజాన్ తీవ్ర పోటీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో Netflix కొన్ని షరతును విధించడం ద్వారా కొత్త సబ్ స్క్రైబర్లను పొందవచ్చనే ఆలోచనతో ఉంది. ఇందులో భాగంగా జూలై 20 నుంచి కేవలం ఇద్దరు మాత్రమే పాస్ వర్డ్ షేరింగ్ చేసుకునే విధంగా నిబంధనలు తేనుంది.
అయితే Netflix కు మిగతా ఓటీటీ సంస్థలు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. 2027 నాటికి స్ట్రీమింగ్ పరిశ్రమ 7 బిలియన్లుగా అభివృద్ధి చెందుతుందని ఓ అంచనా. అయితే 2022జనవరి నుంచి 2023 మార్చి వరకు డిస్నీ+హాట్ స్టార్ 38 శాతం వీక్షిస్తున్నారని తేలింది. మొత్తంగా భారత్ లో ఈ ఓటీటీ 50 మిలియన్ల సబ్ స్క్రైబర్లను కలిగి ఉంది. ఆమెజాన్, జియో సంస్థలు దీనికి పోటీ ఇస్తున్నాయి.
డిస్నీ+హాట్ స్టార్ లో ప్రస్తుతం 10కి పైగా డివైజ్ ల్లో పాస్ వర్డ్ షేర్ చేసుకునే విధానం ఉంది. అయితే పాస్ వర్డ్ షేర్ సంఖ్య తగ్గిస్తే వినియోగదారులను కోల్పోతామని ఈ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 4గురికి పాస్ వర్డ్ సంఖ్యను పరిమిమితి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒకవేళ వినియోగదారులను కోల్పోతున్నామని తేలితే ప్లాన్ ధర తక్కువ చేసి రెండు డివైజ్ లకు పరిమితి చేయనుంది. Netflix నిబంధనలు జూలై 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదే సమయంలో డిస్నీ+హాట్ స్టార్ కూడా అదే బాటలో వెళ్తోందని చెప్పకనే చెబుతోంది. ఈ క్రమంలో అమెజాన్, జియో లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.