Sr NTR Chief Security: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు అంటే తెలియని వారు టాలీవుడ్ లోనే కాదు టోటల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఉండరు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కథానాయకుడు ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనంగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ ,హిందీ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు ఉంది.
పౌరాణిక చిత్రాల్లో రాముడైనా ..భీముడైన ,కృష్ణుడైన… దుర్యోధనుడైన ఇలాగే ఉంటారా అనిపించేలా ఆ పాత్రలో సెట్ అవ్వగలిగే వ్యక్తి ఎన్టీఆర్ ఒక్కరే. తెలుగు సినిమాకి చుక్కాని వంటి వ్యక్తి ఎన్టీరామారావు…సినిమాల్లోనే కాదు రాజకీయపరంగా కూడా తెలుగు ప్రజలకు మరింత మేలు చేయాలి అనే ఉద్దేశంతో తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహానుభావుడు.
ప్రేక్షకులను తన నటనతో అలరించి, మెప్పించిన ఎన్టీఆర్ను ఆంధ్రులు అభిమానంగా అన్నగారు అని పిలిచేవారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తెలుగువారి సత్తా ఢిల్లీ వరకు తెలిసేలా చేసిన ఘనత ఎన్టీఆర్ ది. ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు..ప్రజలు ఎన్నటికీ మరచిపోని ఒక గొప్ప వ్యక్తి.
ఎన్టీ రామారావు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన నరసయ్య ఆనాడు ఎన్టీఆర్ తో తాను చూసిన కొన్ని సంఘటనలను ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎన్టీఆర్, పీఎం మధ్యలో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన వివరించారు. బీమాస్ హోటల్ రైల్వే క్రాస్ గేట్ వద్ద ఓపెన్ టాప్ జీప్ లో పీఎం వస్తుంది.. మరోపక్క క్రాసింగ్ కి అవతల ఎన్టీఆర్ తిరుపతిలో పోటీ చేస్తున్న క్యాండిడేట్గా తన ఎన్నికల ప్రచాణానికి వెళ్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున స్వయంగా అప్పటి పరధానమంత్రి ప్రచారానికి రావడం జరిగింది.అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు కావాలని పిఎం మీటింగ్ ని డిలీట్ చేయడమే కాకుండా ప్రోగ్రాంలో లేని రోడ్ షో ని నిర్వహించారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి క్రాస్ రోడ్ కామన్ గా ఉంటుంది. ఇద్దరు ఒకేసారి దాన్ని దాటడం జరిగితే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు తెలియని పరిస్థితి.
అందుకే ఇద్దరు ఒకేసారి ఎదురుపడితే సెక్యూరిటీ ప్రాబ్లమ్ అవుతుందని నరసయ్య మొదటిసారిగా ఎన్టీఆర్ వద్దకు వెళ్లి విషయం వివరించడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించిన ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ కోసం వెయిట్ చేయడంలో తప్పేమీ లేదు అని అన్నారట.ఆ విషయం గురించి ప్రస్తావించిన నరసయ్య ఎన్టీఆర్ కాబట్టి అలా మాట్లాడారు అదే ఈ రోజుల్లో నాయకులైతే ఎవరు వస్తే నాకేంటి నాపాటికి నేను వెళ్తాను అని అనేవారు అన్నారు. ఎన్టీఆర్ కేవలం మాటలు మాత్రమే చెప్పడం కాదు చేతల్లో అవి అక్షరాల ఆచరించే వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు.