https://oktelugu.com/

‘పవన్’ బర్త్ డే స్పెషల్ రెడీ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీర మల్లు’ సినిమాతో పాటు మలయాళ రీమేక్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా కూడా చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ఎక్స్ క్లూజివ్ అప్ […]

Written By: , Updated On : August 12, 2021 / 06:20 PM IST
Follow us on

Harish Shankar Suprise for Pawan Fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీర మల్లు’ సినిమాతో పాటు మలయాళ రీమేక్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా కూడా చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ మీ కోసం.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అయితే, పవన్ పుట్టినరోజు నాడు హరీష్ శంకర్ తన సినిమాకి సంబంధించి ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. పవన్ పుట్టినరోజుకు తమ సినిమా నుండి ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నాడు. పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ ఇటీవలే అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ సెట్స్ లో కలిసి.. ఈ పోస్టర్ రిలీజ్ గురించి తెలియజేశాడు.

కాగా తన పుట్టినరోజుకు స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మరి పవన్ బర్త్ డేకి హరీష్ శంకర్ ఎలాంటి లుక్ ను డిజైన్ చేస్తాడో చూడాలి. ఒకటి మాత్రం నిజం, ఈ సినిమా అప్ డేట్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా గతంలో
హరీష్ – పవన్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సృష్టించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది ‘గబ్బర్ సింగ్’ మూవీ. మరి పవన్ కళ్యాణ్ కి అంతటి భారీ సినిమాని అందించిన హరీష్ శంకర్, మళ్ళీ పవన్ తో మరో సినిమా చేస్తున్నాడు కాబట్టి భారీ అంచనాలు సహజం. అయితే, ఈ సారి వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తోందో చూడాలి. అన్నట్టు పవన్ ఈ సినిమాలో ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తాడట.