Pawan Kalyan – Balayya : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan|) అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ‘ఓజీ'(They Call Him OG) చిత్రం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇది నేటి తరం యూత్ ఆడియన్స్ మైండ్ సెట్ కి తగ్గ చిత్రం, అందులోనూ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక మంచి పొటెన్షియల్ కథ ని ఎంచుకోవడం ఆసక్తిని రేపే అంశాలు. దానికి తోడు 2023 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో కారణంగా ఈ సినిమా పై అంచనాలు అభిమానులు కూడా ఊహించని రేంజ్ కి చేరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే షూటింగ్ కూడా తిరిగి ప్రారంభం అవ్వని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేట్స్ కి అమ్ముడుపోయాయి.
రీసెంట్ గానే షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లో కొన్నిరోజుల పాటు షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం, ఆ తర్వాత ముంబై కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ గత నాలుగు రోజుల నుండి షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో పాన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ మధ్య కొన్ని ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఇమ్రాన్ హష్మీ కి డెంగ్యూ ఫీవర్ రావడం తో డాక్టర్లు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడం వల్ల వీళ్లిద్దరి కాంబినేషన్ సన్నివేశాల షూట్ కొంతకాలం వాయిదా పడింది. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎట్టిపరిస్థితి లో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదే తేదికి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అఖండ 2′(Akhanda 2) చిత్రం కూడా విడుదల కాబోతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు.. బాలయ్య-పవన్ 20 నిమిషాల ఏకాంత భేటిలో ఏం జరిగింది!
ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజునే సెప్టెంబర్ 25 న విడుదల చేస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా అనుకున్న సమయం లో పూర్తి కావడం లేదు కాబట్టి ఈ చిత్రం చెప్పిన డేట్ కి వచ్చే అవకాశం లేదని, బాలయ్య కి ఎంతగానో కలిసొచ్చిన పొంగల్ కి ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావించారు. కానీ మేకర్స్ ఇప్పటికీ సెప్టెంబర్ 25 ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జూన్ 10 న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ని విడుదల తేదీ తో సహా విడుదల చేస్తారట. అదే కనుక జరిగితే సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ మరియు నందమూరి అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.