Bhairavam first day collections : మంచు మనోజ్(Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohit) కలిసి నటించిన మల్టీస్టార్రర్ చిత్రం ‘భైరవం'(Bhairavam Movie) నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకు మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళ ‘గరుడన్’ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా అద్భుతంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ తెరకెక్కించాడని, ముఖ్యంగా ముగ్గురు హీరోల నుండి అద్భుతమైన నటనని రాబట్టుకోవడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. టాక్ బాగా వచ్చింది కానీ ఓపెనింగ్ మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లోనే వచ్చింది. హీరోలు ముగ్గురు కూడా సినిమాలకు దూరమై చాలా కాలం అవ్వడమే అందుకు కారణం అవ్వొచ్చు. కానీ ఫస్ట్ షోస్ నుండి ఈ చిత్రం బాగా పుంజుకుంది. ఫలితంగా మంచి ఓపెనింగ్ వసూళ్లకు కారణమైంది ఈ చిత్రం.
బుక్ మై షో యాప్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 40 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది చాలా డీసెంట్ అని చెప్పొచ్చు. నిన్న మ్యాట్నీ షోస్ నుండి ఈ చిత్రానికి గంటకు రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. సినిమాకి గ్రౌండ్ లెవెల్ లో ఎలాంటి టాక్ ఉంది అనేది ఈ టికెట్ సేల్స్ ట్రెండ్ ని చూస్తేనే అర్థం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చి ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మొదటి రోజు రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో వస్తున్న వసూళ్లు ట్రేడ్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది.
Also Read : ఒకపక్క మెగా ఫ్యాన్స్.. మరోపక్క వైసీపీ ఫ్యాన్స్.. పాపం ‘భైరవం’ పరిస్థితి ఏంటో!
నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 38 వేల డాలర్లు వచ్చాయట. ఇది ఈ ముగ్గురు హీరోల కెరీర్ బెస్ట్ అని అంటున్నారు అక్కడి విశ్లేషకులు. అంతే కాకుండా మొదటి రోజు కూడా అప్పుడే పది వేల డాలర్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని, కచ్చితంగా మంచి లాంగ్ రన్ ఉండేందుకు అవకాశాలు ఉన్న సినిమా అని, ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. జూన్ 12 ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల అయ్యేవరకు ఈ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవు. కాబట్టి మంచి థియేట్రికల్ రన్ ఉండే అవకాశాలు ఉన్నాయి, ఫుల్ రన్ లో ఈ చిత్రాన్ని కొన్ని ప్రతీ బయ్యర్ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లో ఉంటారు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుంది అనేది.