Supreme Court Notices KTR: కేటీఆర్ వెంట భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నాయకులు అమెరికా వెళ్లిపోయారు. అక్కడ నిర్వహించిన రజత వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వ్యాపారులతో.. ఇతర నిపుణులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్లు చేయాలని సూచించారు. మీరు ఎక్కడ స్థిరపడినా.. తెలంగాణ అనేది పురిటి గడ్డ అని.. ఆ విషయాన్ని మర్చిపోవద్దని కేటీఆర్ సూచించారు. దానికి అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వ్యాపారులు తమ సమ్మతం తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెడతామని.. తెలంగాణ అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం అందిస్తామని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇంకా విదేశాలలోనే ఉన్నారు. హీరో గానే ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.. దీంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితిలో కలకలం నెలకొంది.
ఇటీవల కాలంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పై భారత రాష్ట్ర సమితి ఆందోళనలకు, నిరసనలకు పిలుపునిచ్చింది. భారత రాష్ట్ర సమితి కీలక నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా కీలక విషయాలను బయటపెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మన దేశంలో అతిపెద్ద న్యాయస్థానం తాఖీదులు జారీ చేయడంతో ఆ పార్టీలో
ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఇటీవల కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ప్రభుత్వ పెద్దలు 25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఆ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదును విచారించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కేటీఆర్ కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తన ఫిర్యాదు పై వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. దానిని సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ దేశ సర్వోన్నత న్యాయస్థానం లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. దీనిని జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ పిటిషన్ కు సంబంధించి సమాధానం చెప్పాలని కేటీఆర్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీంతో ఒకసారిగా భారత రాష్ట్ర సమితిలో కలకలం నెలకొంది.. వాస్తవానికి ఇటీవల కాలంలో కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని ఏకవాక్యంతో సంబోధిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. వివిధ అభివృద్ధి పనుల్లో అడ్డగోలుగా అవినీతి జరుగుతోందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. వారంలో మూడు నాలుగు పర్యాయాలు విలేకరుల సమావేశం నిర్వహించి.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అయితే వీటికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నప్పటికీ.. కొంతమంది నాయకులు ఇదిగో ఇలా హయ్యర్ కోర్టుల తలుపులు తడుతున్నారు. తద్వారా దూకుడు మీద ఉన్న ప్రతిపక్ష పార్టీకి స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. మరి దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు? సర్వోన్నత న్యాయస్థానానికి ఎలాంటి సమాధానం చెబుతారు? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభిస్తాయని తెలుస్తోంది.