Jagan And Undavalli: ఈవీఎంలపై ప్రచారంలో జగన్‌, ఉండవల్లి బ్యాచ్.. మిస్ అవుతున్న సింపుల్ లాజిక్ ఇదే !

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ప్రతీసారి ఈవీఎంల పనితీరుపై ఓడిన పార్టీలు అనుమానించడం పరిపాటిగా మారింది. గతంలో బీజేపీ ఈవీఎంలను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు ఇండియా కూటమి పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

Written By: Neelambaram, Updated On : August 22, 2024 8:52 am

Jagan And Undavalli

Follow us on

Jagan And Undavalli: దేశ పార‍్లమెంటుతోపాటు.. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ మినహా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో సిట్టింగ్ ప్రభుత్వాలు కూలిపోయాయి. ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ అధికారం కోల్పోయాయి. ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. టీడీపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 166 సీట్లు గెలుచుకుని తిరుగులేని మెజారిటీ సాధించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో జూన్‌ 18న ఏసీ మాజీ సీఎం జగన్‌ ఈవీఎంలపై సంచలన ట్వీట్‌ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌నే వాడుతున్నాయని.. మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలన్నారు. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని.. ‘మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ఈవీఎంల బదులు పోస్టల్‌ బ్యాలెట్లను ఉపయోగించాలి’ అంటూ ట్వీట్ చేశారు. తర్వాత వీవీప్యాట్ల లెక్కింపుపై వైసీపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అవసరమైన ఫీజు కూడా చెల్లించారు. ఈ క్రమంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏపీలో 12.5 శాతం మేర ఓట్లు అధికంగా పోల్ అయ్యాయంటూ ఓట్ ఫర్ డెమోక్రసీ బాంబు పేల్చింది. దీని ఆధారంగా జగన్‌ తన సొంత మీడియాలో నిత్యం వార్తలు ప్రచురిస్తున్నారు. డిబేట్లు నిర్వహిస్తున్నారు. బాలినేని రీవెరిఫికేషన్‌ తీరుపైనా ఈసీని తప్పు పడుతూ ‍కథనాలు ప్రచురించారు. చర్చ నిర్వహించారు.

ఈవీఎంలపై ‘ఉండవల్లి’ కీలక వ్యాఖ్యలు..
జగన్‌.. ఈవీఎంలపై, 12.5 శాతం అధికంగా ఓట్లు పోల్‌ కావడాన్ని వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి దొడ్డిదారిన(ఈవీఎంలను ట్యాంపర్‌చేసి) అధకారంలోకి వచ్చిందన్న అభిప్రాయం జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిపై లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏపీలో 12.5 శాతం మేర ఓట్లు అధికంగా పోల్ అయ్యాయంటూ ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన సమాచారంపై స్పందించారు. 12.5 శాతం ఓట్లు అధికంగా పోల్ కావడం అంటే మాటలు కాదని, దీనిపై ఎందుకు విచారణ జరిపించకూడదని ప్రశ్నించారు. అది అబద్ధం, అవాస్తవం అని తేలితే ఏపీలో ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ కార్యకలాపాలను నిషేధించవచ్చని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడేనని, ఆయన ప్రభుత్వంపై ఈ సంస్థ చేసిన ఆరోపణలపై స్పందించకపోవడం పట్ల ఉండవల్లి అరుణ్ కుమార్ అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో చంద్రబాబు ఎక్స్‌పర్ట్ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 81 ప్రకారం..స్లిప్పులను 45 రోజుల పాటు భద్రపర్చాల్సి ఉందని, పోలింగ్ ముగిసిన 20 రోజుల్లోనే వాటిని డెస్ట్రాయ్ చేయాలంటూ అప్పటి ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలను సైతం జారీ చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

ఈ లాజిక్‌ ఎలా మిస్‌ అవుతున్నారు..
ఇక ఎన్డీఏ సర్కార్‌ ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసిందన్న అనుమానాలను వైసీపీ అధినేత జగన్‌ వ్యక్తం చేశారు. దీనిని ప్రజల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంపై నిత్యం చర్చ జరిగేలా చూసుకుంటున్నారు. తాజాగా జగన్‌కు ఉండవల్లి జత కలిశారు. తప్పుడు విధానంలోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచా‍్చరని ఆరోపించారు. అయితే ఇంత రచ్చ చేస్తున్న జగన్‌, ఉండవల్లి.. చిన్న లాజిక్‌ మిస్‌ అవుతున్నారు. ప్రధాని మోదీ.. ఏపీలో ఈవీఎంలను చేయించి ఉంటే.. బీజేపీ కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా ఎక్కువ సీట్లలో గెలిచేది కదా. తనకు టీడీపీ, జేడీఎస్‌తో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. తాను బలంగా తయారయ్యే అవకాశాన్ని ఎలా ఒదులుకుంటారు. దీనిని గ్రహించని నేతలు ఎవరో చెప్పారని అధికంగా ఓట్లు పోలయ్యాయని, ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయని రచ్చ చేయడం, బట్టలు చించుకోవడం గమనార్హం.