Pawan Kalyan-Allu Arjun : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొడుకు మార్క్ శంకర్(Mark Shankar) ఇటీవలే సింగపూర్ లోని సమ్మర్ స్కూల్ క్యాంప్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో చిక్కుకొని గాయాలపాలై, ఆ తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి హైదరాబాద్ కి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ప్రార్థన చేశారు. పలువురు సినీ ప్రముఖులు కూడా అందులో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త మండిపడ్డారు. నీకు కష్టసమయం వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలబడింది, కానీ నువ్వు మాత్రం పసిబిడ్డకు గాయమైతే స్పందించలేదు అంటూ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని ట్యాగ్ చేసి బాగా తిట్టారు. కానీ రీసెంట్ గానే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ నివాసంలో తన భార్య స్నేహా రెడ్డి తో పాటు వెళ్లి కలిశాడు.
Also Read : గుడ్ బ్యాడ్ అగ్లీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు వెర్షన్ కూడా కుమ్ముతుందిగా!
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది అని గత కొంతకాలంగా సోషల్ మీడియా లో వస్తున్న రూమర్స్ కి వీళ్లిద్దరి సమావేశం చెక్ పెట్టింది. సుమారుగా గంటసేపు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడాడు అట. వీళ్లిద్దరికీ సంబంధించిన ఫోటోలు ఒక్కటైనా విడుదలైతే బాగుండును అని అభిమానులు చాలా కోరుకున్నారు. కానీ ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. అల్లు అర్జున్ గతంలో తానూ అరెస్ట్ అయ్యినప్పుడు ఇంటికి వచ్చిన చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లి కలిసిన ఫోటోలు సోషల్ మీడియా లో వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ తో సమావేశమైన ఫోటోలు మాత్రం ఎందుకు బయటకు రాలేదు?, అసలు కారణం ఏమి అయ్యుంటుంది అని అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. అల్లు అర్జున్ పీఆర్ టీం సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
ఆయన ఎవరిని కలిసినా, ఎవరితో సమావేశమైన అందుకు సంబంధించిన ఫోటోలను వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఎందుకు చేయలేదు?, అసలు నిజంగానే వాళ్ళు ఇద్దరు కలిసారా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కలిసారని స్వయంగా అల్లు అర్జున్ సన్నిహితులే చెప్ప్తున్నారంటే అది కచ్చితంగా నిజమే. కలిసిన ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తే, ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో విబేధాలు తొలగి అంతా ఎప్పటి లాగానే ఉండేవాళ్ళు కదా, ఎందుకని దాచి పెట్టారు?, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా విడుదల చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో ఎక్కువ పవన్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్నాయి కాబట్టి, కేవలం అవి చల్లార్చడం కోసమే వెళ్లి కలిసినట్టు జనాల్లోకి వెళ్తుందని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత అంశంగా మాత్రమే ఉండాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది.