L2 Empuraan : మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ఎంతో గర్వంగా భావించిన మోహన్ లాల్(Mohanlal) లేటెస్ట్ చిత్రం ‘L2: ఎంపురాన్'(L2 :Empuraan) వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. లూసిఫర్ సీక్వెల్ కావడంతో టాక్ కాస్త డివైడ్ గా వచ్చినా ఓపెనింగ్స్ కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. కేవలం ఓపెనింగ్స్ వరకే కాదు, పది రోజుల పాటు ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుండి మొట్టమొదటి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ అవకాశాలు ఇప్పుడు కనుచూపు మేర కనిపించడం లేదు. విడుదలై విజయవంతంగా 19 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కనీసం 50 శాతం రికవరీ ని కూడా సాధించలేకపోయింది. ఇప్పుడు వస్తున్న వసూళ్లన్నీ మలయాళం వెర్షన్ కి సంబంధించినవే.
Also Read : అక్షరాలా 262 కోట్లు..కానీ ‘L2: ఎంపురాన్’ కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది ఎంతంటే!
కేరళ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 86 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం కేరళ రాష్ట్రం నుండే 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తుంది అనుకుంటే, కేవలం 90 కోట్ల రూపాయిల వద్ద ఈ సినిమా ఆగిపోయేలా కనిపిస్తుంది. ఒక అద్భుతమైన బెంచ్ మార్క్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి నాలుగు కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తమిళనాడు ప్రాంతం నుండి 10 కోట్ల రూపాయిలు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 22 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ నుండి ఏకంగా 144 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమాకు రివ్యూస్, రేటింగ్స్ గొప్పగా లేవు, లేకపోతే కేవలం ఓవర్సీస్ నుండి 200 కోట్లు రాబట్టేంత సత్తా ఉన్న చిత్రమిది.
ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 268 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 125 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్స్ ఇప్పటికే 24 కోట్ల రూపాయిల లాభాలను మూటగట్టుకున్నారు. ఫుల్ రన్ లో అతి కష్టం మీద ఈ సినిమాకు 280 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి రాబట్టడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. సినిమాకు కాస్త టాక్ బాగా వచ్చి ఉండుంటే, కచ్చితంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చేది. డైరెక్టర్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే బాగుండేది. మిగిలిన పాన్ ఇండియన్ సినిమాల లాగా కాకుండా, ఈ సినిమాకు ఇతర భాషల్లో క్రేజ్ లేకపోవడం వల్లే అనుకున్న టార్గెట్ ని చేరుకోలేకపోయి ఉండొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ వీకెండ్ తర్వాత దాదాపుగా క్లోజింగ్ వసూళ్లు వేసేసుకోవచ్చు.