Pawan Kalyan weight loss diet : ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కుంభమేళా లో చొక్కా విప్పి స్నానం ఆచరిస్తున్నప్పుడు ఆయన లుక్స్ ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఏ రేంజ్ లో ఎగతాళి చేశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బానపొట్ట, సాగిపోయిన బుగ్గలు, ఇలా పూర్తిగా షేప్ అవుట్ లో కనిపించి అభిమానులు కూడా సర్దిచెప్పుకోలేని రేంజ్ లో కనిపించాడు. కానీ ఆ తర్వాత మాత్రం సినిమాల కోసం పవన్ కళ్యాణ్ వర్కౌట్స్ చేయడం మొదలు పెట్టాడు. కేవలం వంద రోజుల గ్యాప్ లోనే 20 కేజీల బరువు తగ్గి అందరినీ షాక్ కి గురయ్యేలా చేసాడు. రీసెంట్ గానే విజయవాడ లో ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ పొట్టి నిక్కరు , టీ షర్ట్ లో కనిపించాడు. చాలా ఫిట్ గా ఇంతకు ముందు లాగా కాకుండా చాలా స్మార్ట్ గా అనిపించాడు.
పవన్ కళ్యాణ్ ని ఈ లుక్ లో చూసిన వెంటనే అసలు వంద రోజుల్లో ఇంత ఫిట్ గా ఎలా తయారు అయ్యాడు?, ఒక పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా,5 కీలకమైన శాఖలకు మంత్రిగా క్షణం తీరిక లేకుండా గడుపుతూ,మరోపక్క సినిమాలు చేస్తూ, ఇంత బిజీ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ వర్కౌట్స్ ఎలా ప్లాన్ చేసాడు అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ మధ్యలో వర్కౌట్స్ చేయడానికి మేము ఎంతో ఇబ్బంది పడుతుంటాము. పవన్ కళ్యాణ్ ఇన్ని బాధ్యతలు మోస్తూ ఈ రేంజ్ వర్కౌట్స్ ఎలా చేస్తున్నాడు. అది కూడా 53 సంవత్సరాల వయస్సులో. అయితే పవన్ కళ్యాణ్ ఒక డైట్ ని చాలా స్ట్రిక్ట్ గా అనుసరించేవాడని, ఆయన తక్కువ సమయంలో అంత తగ్గడానికి కారణం ఇదే అని అంటున్నారు.
Also Read : కొణిదెల గ్రామానికి పవన్ కల్యాణ్ 50 లక్షల అందజేత
కొన్ని నెలల నుండి పవన్ కళ్యాణ్ కేవలం రోజు కి ఒక్క పూట మాత్రమే అన్నం తింటున్నాడట. అది కూడా చాలా మితంగా. అంతే కాకుండా ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు బ్లాక్ కాఫీ తాగుతాడని , మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం లైట్ గా మీల్స్ ని ఆరగిస్తాడని, ఇక రాత్రి అయితే ఫ్రూట్ జ్యూస్ లేదా మజ్జిగ ని తాగుతాడని, ఇలా చేస్తూ గడిచిన మూడు నెలల్లో పవన్ కళ్యాణ్ 20 కిలోల బరువు తగ్గినట్టు తెలుస్తుంది. వర్కౌట్స్ హెవీ గా చేసినా చేయకపోయినా ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల కొంత వరకు బరువు తగ్గొచ్చు. మీరు కూడా ఈ డైట్ ని తూచా తప్పకుండా అనుసరించి చూడండి. ఒకవేళ తగ్గితే మాత్రం ఈ డైట్ కి ఇక తిరుగు లేనట్టే లెక్క.