Thug Life Simbu role Telugu actor : కొన్ని సినిమాలు చేయడం కంటే, వదిలేయడమే మంచిది, మనసుకి నచ్చకుండా ఏ పని కూడా చెయ్యకూడదు. పెద్ద స్టార్ హీరో తమ సినిమాలో కీలక పాత్ర పోషించమని అడిగితే కథ నచ్చకపోయినా,నో చెప్పడానికి ఇష్టం లేక కొంతమంది యంగ్ హీరోలు చేస్తూ ఉంటారు. అందుకు బెస్ట్ ఉదాహరణ శింబు(Silambarasan TR). రీసెంట్ గా ఈయన కమల్ హాసన్(Kamal Haasan) తో కలిసి ‘థగ్ లైఫ్'(Thug Life) అనే చిత్రం లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. శింబు అనేక సన్నివేశాల్లో కమల్ హాసన్ ని డామినేట్ చేసాడు అనే టాక్ అయితే వచ్చింది కానీ, ఈ సినిమా అనవసరంగా చేసాడు, ఆయన రేంజ్ కి తగ్గ చిత్రం కాదని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు.
అయితే ముందుగా ఈ పాత్ర కోసం చాలా మంది యంగ్ హీరోలని సంప్రదించారట. అందులో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కూడా ఒకడు. అప్పట్లో ఈ సినిమాలో ఆయన భాగం అయ్యాడు అంటూ మూవీ టీం నుండి అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఆయన ఫైనల్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఇది నాకు తగిన సినిమా కాదని తప్పుకున్నాడట. ఇక ఆ తర్వాత మూవీ టీం మన టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) సంప్రదించారట. ఒకప్పటి నాని అయితే కమల్ హాసన్ లాంటి పెద్ద సూపర్ స్టార్ పక్కన నటించే అవకాశం వస్తే వదులుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు నాని వేరే, సినిమా సినిమాకు తన స్పాన్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ విన్న వెంటనే అలోచించి చెప్తాను అని కూడా అనలేదట. నాకు వర్కౌట్ అవ్వదు సార్ ఈ సినిమా అని నేరుగా మణిరత్నం కే చెప్పాడట. స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో నాని అంత పక్కాగా ఉన్నాడు.
Also Read : ‘థగ్ లైఫ్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఓవర్సీస్ లో కలెక్షన్స్ అదిరిపోయాయిగా!
ఇక రాక రాక ఈమధ్యలోనే ఫామ్ లోకి వచ్చి వరుస సూపర్ హిట్ సినిమాలను అందుకుంటున్న శింబు ని కమల్ హాసన్ ఇందులో నటించమని అడిగిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒకే చెప్పేశాడట. ఎందుకంటే కమల్ హాసన్ నిర్మాతగా,శింబు హీరో గా ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే కమల్ హాసన్ ఈ ప్రతిపాదన పెట్టడం,శింబు వెంటనే ఓకే చెప్పడం జరిగింది. అంతే కాదు శింబు మొదటి నుండి కమల్ హాసన్ కి వీరాభిమాని. అలాంటి లెజెండ్ పక్కన పది నిమిషాలు కనిపించినా చాలు అనుకున్నాడు. అందుకే ఈ చిత్రం ఒప్పుకున్నాడు అంటూ శింబు అభిమానులు చెప్తున్నారు. ఏది ఏమైనా నాని , దుల్కర్ సల్మాన్ వంటి హీరోలు ఈ చిత్రం నుండి తప్పించుకొని చాలా తెలివైన పని చేసారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.