Pawan Kalyan fans anger: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ(They Call Him OG) మూవీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని LB స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా పిడుగులతో కూడిన భారీ వర్షం రావడం తో, అనుకున్న రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపలేకపోయారు. ఇది అభిమానులకు తీవ్రమైన నిరాశ ని మిగిలించింది. ఓజీ లాంటి క్రేజీ చిత్రానికి ప్లానింగ్ విషయం లో ఇంత జాప్యమా?, ప్రతీ రోజు రాత్రి హైదరాబాద్ లో వర్షం ఈమధ్య కాలం లో వస్తూనే ఉంది. ఇలాంటి సమయం లో ఓపెన్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయడం అంత అవసరమా?, శిల్ప కళా వేదిక లాంటి క్లోజెడ్ ఆడిటోరియం లో పెట్టుకోవచ్చు కదా అనేది అభిమానుల వాదన.
అంతే కాదు నిన్న థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేస్తామని చెప్పారు. ముందుగా ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు, ఆ తర్వాత ఇప్పుడు కుదరదు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేస్తామని చెప్పారు. తీరా అప్పుడైనా చేశారా అంటే లేదు. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గోల చేసి అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ కి ట్రైలర్ ని ప్రదర్శించారు. దీనిని మొబైల్ తో రికార్డు చేసిన వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది బాగా వైరల్ అయ్యింది. వెంటనే మూవీ టీం రియాక్ట్ అయ్యి కాపీ రైట్స్ స్ట్రైక్ వేసి తొలగించేసారు. కానీ మూడు రోజుల్లో సినిమా విడుదల పెట్టుకొని థియేట్రికల్ ట్రైలర్ లేకపోవడం అనేది గడిచిన రెండు దశాబ్దాలలో ఏ సినిమాకు కూడా జరగలేదు. వీళ్ళ ప్లానింగ్ ని చూసి మీకంటే పాత కాలం మనిషి అయినటువంటి AM రత్నం బెటర్ కదా అంటూ పవన్ ఫ్యాన్స్ DVV టీం ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో బండ బూతులు తిడుతున్నారు.
ఎంతో కష్టపడి రెండేళ్ల పాటు తీసిన సినిమా. మూవీ టీం కి పని చేసిన వాళ్ళు తమ అనుభవాన్ని చెప్పుకునే వేదిక లేకుండా చేసినందుకు అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. కనీసం ప్రెస్ మీట్ అయినా నిర్వహించండి అంటూ బ్రతిమిలాడుతున్నారు. మరి మేకర్స్ స్పందిస్తారో లేదో చూడాలి. ఇక ట్రైలర్ అప్డేట్ విషయానికి వస్తే ఈరోజు విడుదల అవుతుందని తెలుసు కానీ, ఏ సమయం లో విడుదల అవుతుంది అనేది మాత్రం తెలియదు. ఇక ప్రస్తుతం ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో అభిమానులకు ఏదైనా శుభవార్త ఉందంటే అది ఓవర్సీస్ కి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కాపీలు వెళ్లిపోవడమే. సెకండ్ హాఫ్ కాపీలు కూడా ఈరోజు సాయంత్రం లోపు వెళ్లిపోతాయి.