Trivikram Srinivas and Pawan Kalyan
Trivikram Srinivas: త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా ముద్ర పడిపోయాడు గానీ, ఆయనలో నటుడు కూడా ఉన్నాడు. అలాగే పాటల రచయిత కూడా ఉన్నాడు. కాకపోతే.. మాటల రచయితగా తెలుగు సినిమా రంగంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడం కారణంగా అలాగే కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. నిజానికి సుమారు 20 ఏళ్ల క్రితం రోజులు అవి. త్రివిక్రమ్ అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజులు అవి.
అప్పట్లో త్రివిక్రమ్(Trivikram Srinivas) రచయితగా ప్రస్థానం అయితే మొదలు పెట్టాడు గానీ, ఆర్ధికంగా సెటిల్ కాలేదు. దాంతో డబ్బుల కోసం పాటల రచయితగా కూడా ప్రయత్నాలు చేసి.. రవితేజ హీరోగా వచ్చిన “ఒక రాజు ఒక రాణి” సినిమాలో అన్ని పాటలు త్రివిక్రమే రాశాడు. ఆ పాటలన్నీ మంచి హిట్ అయ్యాయి. కానీ ఆ సినిమా మాత్రం పరాజయం అయింది.
దాంతో పాటలు బాగున్నప్పటికీ తుస్సుమన్నాయి. ఇక ఈ మధ్యలో మాటల రచయితగా పేరు వచ్చింది. ఇక మాటల రచయితగానే తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత డైరెక్షన్ చేసి.. స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే, “ఒక రాజు ఒక రాణి” సినిమా హిట్ అయి.. ఆ సినిమాలో కూడా పాటలకు బాగా పేరు వచ్చి ఉంటే.. త్రివిక్రమ్ సినీ ప్రయాణం మరోలా ఉండేదేమో.
పాటల రచయితగా ఆయన ప్రయాణం కొనసాగేదే. కానీ అలా జరగలేదు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’లో “లాలా భీమ్లా” అనే పాట త్రివిక్రమ్ రాయాల్సి వచ్చింది. ఆ పాట పవన్ కి బాగా నచ్చింది. ఇప్పుడు తన మిగిలిన సినిమాల్లో కూడా త్రివిక్రమ్ చేత ఒక్కో పాట రాయించాలని పవన్ నిర్ణయించుకున్నాడు. మొత్తానికి త్రివిక్రమ్ ను పవన్ పాట రాసే దాకా వదిలేలా లేడు.
అయినా త్రివిక్రమ్ గతంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు ఆయన కొన్ని పదాలను ఇచ్చేవారు. పవన్ కళ్యాణ్ లాంటి హీరోలను తెగ పొగుడుతూ, ఆకాశానికెత్తుతూ పాటలు రాయించుకోవడం త్రివిక్రమ్ కి బాగా ఇష్టం
Also Read: త్రివిక్రమ్ మొదటి సినిమా పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు..