Madhuri Dixit: గొప్ప మనసు చాటుకున్న మాధురి దీక్షిత్​ తనయుడు.. నెటిజన్లు ఫిదా!

Madhuri Dixit: బాలీవుడ్​ సీనియర్​ హీరోయిన్​ మాధురి దీక్షిత్​ తనయుడు ర్యాన్​ తన గొప్పమనసు చాటుకున్నారు. నేషనర్​ కేన్సర్ అవేర్​నెస్​ డే సందర్భంగా కేన్సర్​ బాధితుల కోస తన జుట్టును దానం చేశారు. దీంతో నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మాధురి దీక్షిత్​ స్వయంగా ఇన్​స్టాగ్రామ్​లో అభిమానులతో పంచుకున్నారు.  ఒకప్పటి అందాల తారగా, డాన్సింగ్​ క్వీన్​గా మాధురి దీక్షిత్​ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. కాగా, మాధురి, శ్రీరామ్ నెనె దంపతుల […]

Written By: Raghava Rao Gara, Updated On : November 8, 2021 5:49 pm
Follow us on

Madhuri Dixit: బాలీవుడ్​ సీనియర్​ హీరోయిన్​ మాధురి దీక్షిత్​ తనయుడు ర్యాన్​ తన గొప్పమనసు చాటుకున్నారు. నేషనర్​ కేన్సర్ అవేర్​నెస్​ డే సందర్భంగా కేన్సర్​ బాధితుల కోస తన జుట్టును దానం చేశారు. దీంతో నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మాధురి దీక్షిత్​ స్వయంగా ఇన్​స్టాగ్రామ్​లో అభిమానులతో పంచుకున్నారు.  ఒకప్పటి అందాల తారగా, డాన్సింగ్​ క్వీన్​గా మాధురి దీక్షిత్​ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. కాగా, మాధురి, శ్రీరామ్ నెనె దంపతుల చిన్న కుమారుడే ర్యాన్​. కేన్సర్ బారిన పడి కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి చలించి పోయిన ర్యాన్​.. జట్టును కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపాలనుకున్నారు.

ఈ క్రమంలోనే రెండేళ్ల పాటు జుట్టును పెంచి కీమో థెరఫీ చేయించుకున్న పేషెంట్ల కోసం డొనేట్​ చేశారు. మొదట ఈ విషయం తెలియగానే తాము ఆశ్చర్యానికి గురైనట్లు మాధురి తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు పెంచుకున్న జుట్టును డొనేట్​ చేయడంపై తన కుమారుడిని చూసి చాలా గర్వపడుతున్నామని మాధురి పేర్కొన్నారు. ర్యాన్​ తీసుకున్న నిర్ణయంపై మాధురి అభిమానులతో పాటు, పలువురు సెలెబ్రిటీలు, నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చిన్న వయసులోనే కొడుకుని అంతా గొప్పగా ఆలోచించేల చేస్తున్న మాధురి దీక్షిత్ ను ను అభినందిస్తూ ఆమె అభినలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.