Priya Marathe Passes Away: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను మార్పులు అయితే జరుగుతున్నాయి. ఇక సినిమా పరంగా మనం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా అందులోని నటులు కొంతమంది అనారోగ్యం భారిన పడి చనిపోతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే మరాఠీ నటి అయిన ‘ప్రియా మరతే’ గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ తో పోరాడుతూ ఆదివారం తన తుది శ్వాసను విడిచారు…ఇక తను మరాఠీలో చాలా సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. కొన్ని సినిమాల్లో కూడా నటించినప్పటికి ఆమెకి సినిమాలకంటే సీరియల్స్ లోనే ఎక్కువ పాపులారిటీ అయితే దక్కింది. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆమెకి క్యాన్సర్ వచ్చిందని తెలుసుకొని కొద్ది రోజులపాటు నటనకి బ్రేక్ ఇచ్చి ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు. ఇక కాన్సర్ తగ్గిందని భావించిన ఆమె మళ్ళీ నటన వైపు ఆసక్తి చూపించారు. కానీ క్యాన్సర్ మళ్లీ ఇబ్బంది పెట్టడంతో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూనే నిన్న తుది శ్వాసను విడిచారు. ప్రియా మరతే భర్త అయిన ‘శంతన్ మూగే’ కూడా మరాఠీ లో మంచి నటుడు కావడం విశేషం… ఆయన పలు సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
యా శుకానో యా, తృశ లాంటి సీరియల్స్ చేసి మంచి పాపులారిటి సంపాదించుకున్నాడు. ఇక తన తండ్రి అయిన శ్రీకాంత్ మోగే కూడా థియేటర్ ఆర్టిస్ట్ కావడం వల్ల తన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని శంతన్ నటుడిగా మారి పలు పాత్రాలను పోషిస్తూ నటుడిగా రాణిస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రియ మరాఠీని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న క్రమంలో 38 సంవత్సరాల వయసులో ప్రియ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన చాలావరకు దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇక దాంతోపాటుగా ప్రియా మరతే తన చివరి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె జైపూర్ లోని కోటకి తన భర్తతో వెళ్లి అక్కడ తన భర్తకు అలాగే తనకు సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేసింది.
ప్రస్తుతం వాటిని తన అభిమానులు గుర్తు చేసుకుంటూ చాలావరకు బాధపడుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా చాలా చిన్న ఏజ్ లోనే ఆమె చనిపోవడం అనేది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతోంది. బ్రైట్ ఫ్యూచర్ తో ముందుకు దూసుకెళుతుందని అనుకున్న ఆమె ఇలా అర్ధాంతరంగా చనిపోవడం అనేది ప్రతి ఒక్కరిని శోక సంద్రంలో ముంచుతుందనే చెప్పాలి…సుశాంత్ సింగ్ తో కలిసి చేసిన ‘పవిత్ర రీస్తా’ అనే సీరియల్ తో ఆమె మంచి గుర్తింపును సంపాదించుకున్నారు…