Sandeep Reddy Vanga challenges Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్ర అయితే ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆయన ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. దానికోసమే అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనే రెండు క్యారెక్టర్ లను పోషించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశాడు. ఇక పాన్ ఇండియాలో సైతం తన సత్తా చాటుకున్న నటుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఆయన వరుసగా సక్సెస్ లను సాధిస్తే నెంబర్ వన్ పొజిషన్ ను అందుకునే అవకాశాలైతే ఉన్నాయి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా సినిమాలను చేస్తే తన ఐడెంటిటీ కోల్పోయి మార్కెట్ ను కూడా భారీగా డౌన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన అన్ని ఆలోచించి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫౌజీ సినిమా చేస్తున్న ఆయన తొందర్లోనే స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.
ఆయన చేసిన దైన కొత్త పాయింట్ ను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్లే ఆయనకు ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ అయితే ఉంది…ఇక ఇప్పుడు మరో సక్సెస్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
అయితే ఒక విషయంలో ప్రభాస్ ఆయనతో మాట్లాడి నువ్వు ఆ పని చేయలేవు అంటూ ప్రభాస్ తో చెప్పాడట. ఇంతకీ ఏ పనో చెప్పు నేను చేస్తానో లేదో చెబుతాను అని ప్రభాస్ అనడంతో సందీప్ రెడ్డి ఓపెన్ అప్ అయిపోయి మీరు ఒక మూడు సీన్లలో మీసాలు లేకుండా కనిపించాలి అని చెప్పారట. దానికి ప్రభాస్ కొంతవరకు ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది…
ఇక మొత్తానికైతే సందీప్ పెట్టిన కండిషన్ ని యాక్సెప్ట్ చేస్తూ ప్రభాస్ తప్పకుండా కనిపిస్తాను అని చెప్పారట. దాంతో ప్రభాస్ యంగ్ లుక్ కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఇందులో ఉండబోతున్నాయి అనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఇదంతా చూసిన ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాతో ప్రభాస్ ఒక మెయిల్ స్టోన్ ను సెట్ చేయబోతున్నాడు అనేది చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు…