https://oktelugu.com/

Naresh- Pavitra Lokesh: నరేష్ గర్వపడేలా చేసిన పవిత్ర లోకేష్… గుడ్ న్యూస్ చెప్పిందిగా!

నరేష్ వ్యక్తిగత జీవితం డిస్టర్బ్ అవుతుంది. ఆమె కారణంగా నరేష్, అతని కుటుంబ సభ్యులు అసౌకర్యానికి గురవుతారని కోర్టు అభిప్రాయపడటం విశేషం.

Written By:
  • Shiva
  • , Updated On : August 5, 2023 / 05:43 PM IST

    Naresh- Pavitra Lokesh

    Follow us on

    Naresh- Pavitra Lokesh: నటుడు నరేష్ వరుస శుభ వార్తలు వింటున్నాడు. ఇటీవల కోర్టు మూడో భార్య రమ్య రఘుపతి విషయంలో నరేష్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మళ్ళీ పెళ్లి ఓటీటీ, థియేట్రికల్ ప్రసారాలను నిలిపివేయాలని రమ్య రఘుపతి పిటిషన్ వేయగా దాన్ని కొట్టి వేసింది. దాంతో మళ్ళీ పెళ్లి ఓటీటీ స్ట్రీమింగ్ కి అడ్డు తొలగింది. అలాగే నరేష్ తో పాటు కలిసి ఉండేలా అనుమతి ఇవ్వాలని కూడా ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో కూడా ఆమెకు చుక్కెదురైంది. నరేష్ ఇంట్లోకి ఆమె ప్రవేశం నిషిద్ధం అంటూ తీర్పు ఇచ్చింది.

    నరేష్ వ్యక్తిగత జీవితం డిస్టర్బ్ అవుతుంది. ఆమె కారణంగా నరేష్, అతని కుటుంబ సభ్యులు అసౌకర్యానికి గురవుతారని కోర్టు అభిప్రాయపడటం విశేషం. దీంతో పవిత్ర లోకేష్ తో వివాహానికి నరేష్ కి లైన్ క్లియర్ అయ్యింది. రమ్య రఘుపతితో నరేష్ కి విడాకులు మంజూరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పుపై నరేష్ హర్షం వ్యక్తం చేశారు. మీడియా ముఖంగా రమ్య తనను టార్చర్ చేసినట్లు మరోసారి ఆరోపణలు చేశారు.

    కాగా నరేష్ మరో గుడ్ న్యూస్ విన్నారు. పవిత్ర లోకేష్ అతడు గర్వపడేలా చేసింది. పవిత్ర లోకేష్ ఎప్పటి నుండో కన్నడ సాహిత్యంలో పిహెచ్డీ చేయాలనుకుంటున్నారు. దీని కోసం ఇటీవల హంపీ కన్నడ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్ష రాశారు. తాజాగా ఫలితాలు విడుదల కాగా ఆమె ఎంపికయ్యారు. పీహెచ్డీ చేసే అర్హత సాధించారు. మొత్తం 981 మంది ప్రవేశ పరీక్ష రాయగా 259 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సమాచారం. నటనలోనే కాదు చదువులో కూడా మేటే అని పవిత్ర లోకేష్ నిరూపించింది.

    పవిత్ర సాధించిన విజయానికి నరేష్ గర్వంగా ఫీలవుతున్నాడు. ఇక ఐదేళ్లకు పైగా నరేష్-పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్నారు. గత ఏడాది వీరి వ్యవహారం బహిర్గతమైంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయాన్ని జంటగా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఫోటోలు బయటకు రాగా నరేష్ నాలుగో పెళ్లి చేసుకున్నాడన్న ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన నరేష్ మేము సహజీవనం చేస్తున్నాము. వివాహం చేసుకోలేదు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు.