Pavitra Lokesh: వినడానికే విచిత్రంగా ఉన్నా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పై ‘పవిత్రా లోకేష్’ ఘాటు ప్రేమే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. నిన్న రిలీజైన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పవిత్రా లోకేష్ రవితేజకు తల్లిగా నటించింది. కానీ.. ఐటమ్ హీరోయిన్ వచ్చినప్పుడు వచ్చే విజిల్స్ ఆమె కనిపించిన ప్రతిసారి వినిపించాయి. కారణం.. నరేష్ – పవిత్రా లోకేష్ ఈ సినిమాలో అన్నా చెల్లెలు పాత్రల్లో కనిపించారు. దాంతో ఈ జంటను చూసిన ప్రతిసారి ప్రేక్షకులు హేళన నవ్వులు, ట్రోలింగ్ ఈలలతో గోలగోల చేశారు.

ఒక్కటి రెండు రెండు థియేటర్స్ లో కాదు, దాదాపు అన్నీ థియేటర్స్ లో ఇదే రచ్చ. అందుకే, రామారావు సినిమా ఫీడ్ బ్యాక్ కంటే కూడా.. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పవిత్రా – నరేష్ ల పైనే ఎక్కువగా కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రసాద్స్ లాంటి మల్టీప్లెక్స్ లలో కూడా వీరు కనబడగానే విజిల్స్ పీక్స్ లో మోత మోగాయి. దీనిబట్టి.. పవిత్రా లోకేష్ -నరేష్ ప్రేమ వ్యవహారం జనంలోకి ఏ స్థాయిలో వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.
పవిత్ర లోకేష్, నరేష్ లు కూడా తమ బంధం పై జనం నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ ను ఊహించి ఉండరు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో పవిత్ర, నరేష్ ఒకే ఫ్రేములో కనిపించిన ప్రతిసారి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ప్రేక్షకులు గొల్లున నవ్వుల మధ్య కొన్నిసార్లు సినిమాలోని మెయిన్ డైలాగ్స్ కూడా వినిపించలేదు. అసలకే రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మ్యాటర్ లేదు. దీనికితోడు.. అనవసరమైనా ఈలలు గోలలు. అందుకే.. సినిమా సగం మందికి అస్సలు కనెక్ట్ కాలేదు.
ఒకపక్క మాస్ మహారాజ్ రవితేజ భారీ ఫైట్స్ చేస్తున్నా… ప్రేక్షకులు మాత్రం నరేష్, పవిత్ర కలిసి ఉన్న సీన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. సినిమాకి ఇది బాగా మైనస్ అయ్యింది. మొత్తానికి అందరూ రామారావుని వదిలేసి పవిత్రా లోకేష్ – నరేష్ ల పై పడ్డారు. రియల్ లైఫ్ లో వీరిద్దరూ అక్రమంగా కలిసి ఉంటున్నారు. అందుకే, ఆ ప్రభావం ఈ రీల్ లైఫ్ మీద బాగా పడింది.
ముఖ్యంగా మైసూర్ లోని ఒక హోటల్లో ఒకే రూమ్ లో నరేష్, పవిత్ర కలిసి కనిపించిన దగ్గర నుంచీ వారి ఇమేజ్ లు బాగా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి రవితేజ రామారావు ఇమేజ్ ను కూడా బాగా డ్యామేజ్ చేశారు. థియేటర్స్ లో రామారావు పరిస్థితి పై టాలీవుడ్ మేకర్స్ మధ్య కూడా చర్చ మొదలైంది.
కచ్చితంగా ఇక నుంచి పవిత్రా లోకేష్ కి పవిత్రమైన పాత్రలు రాకపోవచ్చు. మొత్తమ్మీద లేటు వయసులో ఘాటు ప్రేమతో పాపం కెరీర్ ను పాడు చేసుకుంది పవిత్రా. ఆమె పై జాలి చూపించడం తప్ప మనం చేసేది ఏమి లేదు.