Pavan Kalyan Shocked About KK Death: ప్రముఖ సింగర్ కెకె అకాల మృతిపై హీరో పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కెకె తన చిత్రాలలో పాడిన హిట్ పాటలను తలచుకుంటూ విచారానికి లోనయ్యారు. మే 31 మంగళవారం సింగర్ కెకె కలకత్తాలో లైవ్ షో ఇచ్చారు. ఈ షో ముగిసిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన స్టే చేసిన హోటల్ లో ఈ సంఘటన చోటు చేసుకోగా దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
Also Read: Kamal Haasan- Venkatesh: అప్పట్లోనే కమల్ పాన్ ఇండియా స్టార్… వెంకీ ఆసక్తికర వ్యాఖ్యలు
సింగర్ కెకె హఠాన్మరణం అభిమానులను శోకసంద్రంలో ముంచి వేసింది. ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కెకె మృతిపై విచారం వ్యక్తం చేస్తూ… ప్రకటన విడుదల చేశారు. ”కెకె గా ప్రసిద్ధి గాంచిన గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధించింది. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణి కలిగిన గాయకుడు కెకె. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. నా చిత్రాల్లో ఆయన ఆలపించిన పాటలు శ్రోతలను అలరించాయి. కచేరి ముగిసిన కాసేపటికే కెకె మరణించడం దిగ్భ్రాంతికరం. ఆయన చివరి శ్వాస వరకు పాడుతూనే ఉన్నారు. శ్రీ కెకె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలి” అంటూ పవన్ ప్రకటనలో తెలియజేశారు.
పవన్ నటించిన చిత్రాలు ఖుషి(ఏ మేరా జహాఁ), బాలు( ఇంతే ఇంతింతే), జల్సా ( మై హార్ట్ ఈజ్ బీటింగ్), గుడుంబా శంకర్( లే లే లే), జానీ( నాలో నువ్వొక సగమై) పాటలను కెకె ఆలపించారు. పవన్ కోసం కెకె పాడిన ఈ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సింగర్ కెకె తో పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read: Economic Growth: భారత్ ఆర్థిక వృద్ధి ఎందుకు ఆగిపోయింది? అడ్డంకులు ఏమిటీ?