https://oktelugu.com/

KK Death Mystery: సింగర్ కెకె మృతిపై అనుమానాలు… విచారణ చేపట్టిన పోలీసులు!

KK Death Mystery: స్టార్ సింగర్ కెకె హఠాన్మరణం ఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది. 53 ఏళ్ల వయసులో ఆయన తనువు చాలించడం అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. మే 31 మంగళవారం కలకత్తాలో కెకె లైవ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన హోటల్ కి చేరుకున్నారు. అక్కడే ఈ సంఘటన చోటు చేసుకుంది. కెకె ఒక్కసారిగా కూలిపోవడంతో సిబ్బంది దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కెకె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కెకె […]

Written By:
  • Shiva
  • , Updated On : June 1, 2022 5:11 pm
    Follow us on

    KK Death Mystery: స్టార్ సింగర్ కెకె హఠాన్మరణం ఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది. 53 ఏళ్ల వయసులో ఆయన తనువు చాలించడం అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. మే 31 మంగళవారం కలకత్తాలో కెకె లైవ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన హోటల్ కి చేరుకున్నారు. అక్కడే ఈ సంఘటన చోటు చేసుకుంది. కెకె ఒక్కసారిగా కూలిపోవడంతో సిబ్బంది దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కెకె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

    singer kk

    కెకె మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కలకత్తా న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో దీన్ని అనుమాస్పద మృతిగానే నమోదు చేశారు. హోటల్ సిబ్బందిని విచారించడంతో పాటు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కెకెను హోటల్ నుండి హాస్పిటల్ కి తీసుకెళ్లే ముందు ఏం జరిగిందో సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పరిశీలిస్తున్నామని అధికారులు తెలియజేశారు. అలాగే ఆడిటోరియం సామర్థ్యం కంటే ఎక్కువగా ఆడియన్స్ వచ్చారా? ఏసీలు పని చేస్తున్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

    Also Read: Pavan Kalyan Shocked About KK Death: స్టార్ సింగర్ కెకె మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి

    అలాగే పలువురు సింగర్ కెకె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిలో కుట్రపూరిత వ్యవహారం చోటుచేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇక కెకె కుటుంబ సభ్యులు కలకత్తా చేరుకున్నారు. వారిని కూడా అధికారులు విచారించనున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పోలీసులు విచారణ సాగే అవకాశం ఉంది. రిపోర్టులో కెకె ది అసహజ మరణంగా తేలితే దీని వెనకున్న వారిని పట్టుకునే ప్రయత్నాలు మొదలవుతాయి.

    singer kk

    ఇక సింగర్ కెకె మరణవార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను షాక్ కి గురిచేసింది. రాజకీయ, చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ప్రధాని మోడీ సైతం కెకె మృతిపై విచారం వ్యక్తం చేశారు. హీరో పవన్ కళ్యాణ్ కెకె మృతికి విచారం వ్యక్తం చేస్తూ… ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ చిత్రాలైన ఖుషి, జల్సా, గుడుంబా శంకర్, బాలు, జానీ చిత్రాల్లో కెకె హిట్ సాంగ్స్ పాడారు. హిందీ, తెలుగు, బెంగాలీ, కన్నడతో పాటు పలు భాషల్లో వందల కొద్దీ పాటలు ఆలపించారు.

    Also Read:Tollywood Star Hero: మందు విందు..టాలీవుడ్ అగ్ర హీరో ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదుగా

    Recommended Videos


     

    Tags