https://oktelugu.com/

NTR Movie Postponed: మరోసారి వాయుదా పడిన ఎన్టీఆర్ సినిమా.. ఆగ్రహం లో ఫాన్స్

NTR Movie Postponed: ఆచార్య వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆచార్య సినిమా ముందు వరుకు రాజమౌళి తర్వాత ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ, ఆచార్య సినిమా 150 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా ఇలాంటి చెత్త సినిమా చెయ్యలేదు..ఏమి సినిమా తీసావు అయ్యా కొరటాలా అంటూ మెగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 1, 2022 / 02:02 PM IST

    NTR

    Follow us on

    NTR Movie Postponed: ఆచార్య వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆచార్య సినిమా ముందు వరుకు రాజమౌళి తర్వాత ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ, ఆచార్య సినిమా 150 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా ఇలాంటి చెత్త సినిమా చెయ్యలేదు..ఏమి సినిమా తీసావు అయ్యా కొరటాలా అంటూ మెగా అభిమానుల చేత తిట్లు తిన్నాడు..చిరంజీవి గారు కూడా ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమాని తన కెరీర్ లో ఇంతకు ముందు ఎప్పుడు కూడా చెయ్యలేదు..మధ్య లో ఎన్నో ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా అవి ఆచార్య రేంజ్ డిజాస్టర్ సినిమాలు కావు అనే చెప్పాలి..ఈ సినిమా చూసిన తర్వాత కొరటాల శివ కి స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం కష్టమే అని చెప్పాలి..కానీ #RRR వంటి సెన్సషనల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కి పిలిచి ఛాన్స్ ఇచ్చాడు అంటే నిజంగా ఆయన చాలా పెద్ద రిస్క్ చేసాడు అనే చెప్పాలి.

    Koratala Siva, NTR

    కొరటాల శివ చెప్పిన కథ ఎన్టీఆర్ కి ఎంతగానో నచ్చడం తో ఆచార్య సినిమా ఫలితం ని కూడా చూడకుండా ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు..తనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ కి ఎలా అయినా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అనే కసితో ఉన్నాడట కొరటాల శివ..అందుకే స్క్రిప్ట్ విషయం లో మరింత హోమ్ వర్క్ చెయ్యడానికి ఎన్టీఆర్ ని సమయం అడిగాడట..ఎన్టీఆర్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..అందుకే షూటింగ్ ఇంత ఆలస్యం అవుతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..స్క్రిప్ట్ లో బాగా మార్పులు చేసి ఇటీవల ఎన్టీఆర్ కి వినిపించిన కొరటాల, స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత ఎన్టీఆర్ కొన్ని కీలకమైన మార్పులు చెయ్యమని కొరటాల శివ కి సూచించాడు అట..ఇప్పుడు దాని మీదనే కొరటాల శివ ద్రుష్టి మొత్తం సారించినట్టు తెలుస్తుంది..అందుకే షూటింగ్ కి మరింత ఆలస్యం అవుతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

    NTR 30

    Also Read: Hardik Pandya: టీమిండియాకు మరో కపిల్ దేవ్ దొరికినట్టేనా?

    ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్స్ కి లీడర్ గా కనిపించబోతున్నాడు..పాత్రకి తగట్టు మేక్ ఓవర్ అయ్యేందుకు ఎన్టీఆర్ తన బాడీ షేప్స్ దగ్గర నుండి హెయిర్ స్టైల్ వరుకు ప్రతి ఒక్కటి మార్చబోతున్నాడు అట..దీనికి కాస్త సమయం పట్టబోతుండడం తో షూటింగ్ కి ఆలస్యం అయేట్టు ఉంది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..జూన్ నెలలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్, ఇప్పుడు జులై లో కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు..తమ అభిమాన హీరో కొత్త సినిమా లేటెస్ట్ న్యూస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురు అయ్యింది..ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరుకు తెలియదు..అలియా భట్ ఈ సినిమా నుండి తప్పుకున్న తర్వాత కొరటాల శివ మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు..అయితే లేటెస్ట్ గా సాయి పల్లవి ని ఈ సినిమా లో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి..ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..కొరటాల శివ ఈసారి బలమైన కథాంశం తో మన ముందుకి రాబోతున్నాడు అనే నమ్మకం ని అభిమానుల్లో కలిగించింది..చూడాలి మరి ఆ నమ్మకం ని కొరటాల శివ ఎంత వరుకు నిలబెట్టుకుంటాడో.

    Also Read: Divya Vani Resigns Row: దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్ వెనుక జరిగింది ఇదా?
    Recommended Videos


    Tags