Homeఎంటర్టైన్మెంట్భీమ్లా నాయక్ ఎంట్రీ అదుర్స్.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే!

భీమ్లా నాయక్ ఎంట్రీ అదుర్స్.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే!

Bheemla Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ మాస్ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది టీమ్. పవన్ అభిమానుల్లో ఉత్సహాన్ని రెట్టింపు చేస్తూ భీమ్లా నాయక్ ఎంట్రీ అదిరిపోయింది. పవన్ లుంగీలో ఆవేశంగా అరుస్తూ ఎంట్రీ ఇచ్చిన విధానం అద్భుతంగా అనిపించింది.

పక్కా మాస్ యాక్షన్ మూడ్ లో పవన్ నడుస్తూ వస్తుంటే.. మాస్ ప్రేక్షకులకు కన్నుల పండుగగా అనిపించింది. ఈ వీడియోలో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే పవన్ మేనరిజాన్ని, బాడీ లాంగ్వేజ్ ను దర్శకుడు సాగర్ చంద్ర చాలా బాగా పట్టుకున్నాడు. ఏది ఏమైనా ఈ ఫస్ట్ గ్లింప్స్ తో మాస్ కే స్పెషల్ టచ్ ఇచ్చారు.

YouTube video player

ఇక వీడియోని చూసిన పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో పవన్ కళ్యాణ్ చాలా బాగా సెట్ అయ్యాడు. ఇక ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ “భీమ్లా నాయక్” అనే పెట్టారు. మొదటి నుంచి ఈ టైటిల్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అందుకే అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అన్నట్టు వీడియో చివర్లో ‘ఏంటీ చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా.. అక్కర్లేదు బండెక్కు’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ కూడా బాగా పేలింది.

కాగా ఈ సినిమాను జనవరి 12, 2021కి రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా పాటలను సెప్టెంబర్ 2 నుంచి విడుదల చేస్తామని ప్రకటించిన సినిమా టీమ్. మొత్తానికి పవన్ – రానా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మళయాలి రీమేక్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ కూడా పని చేస్తున్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version