https://oktelugu.com/

Nidhi Agarwal: పవన్ కళ్యాణ్ తో చేయ‌డం అదృష్టంగా భావిస్తోందట !

Nidhi Agarwal: బోల్డ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఎక్కడా తగ్గేదే లేదు అంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న ‘హీరో’ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. జనవరి 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే, తాజాగా ఈ హాట్ బ్యూటీ మీడియాతో చిట్ చాట్ పోగ్రామ్ పెట్టింది. ఈ సందర్భంగా బోలెడు విషయాలు చెప్పుకొచ్చింది. శ్రీ‌రామ్ ఆదిత్య చెప్పిన కథ తనకు బాగా నచ్చిందట. కమర్షియల్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 12, 2022 / 09:31 AM IST
    Follow us on

    Nidhi Agarwal: బోల్డ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఎక్కడా తగ్గేదే లేదు అంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న ‘హీరో’ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. జనవరి 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే, తాజాగా ఈ హాట్ బ్యూటీ మీడియాతో చిట్ చాట్ పోగ్రామ్ పెట్టింది. ఈ సందర్భంగా బోలెడు విషయాలు చెప్పుకొచ్చింది. శ్రీ‌రామ్ ఆదిత్య చెప్పిన కథ తనకు బాగా నచ్చిందట.

    Nidhi Agarwal:

    కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఆఫ్ బీట్ చిత్రం అట ఈ హీరో సినిమా. అన్నట్టు తనకు కథ నచ్చితే చాలు అట. అంతేగాని, ఆ హీరో.. పెద్ద హీరోనా ? , లేక కొత్త హీరోనా అనేది అసలు చూడడు అట. అందుకే ‘హీరో’ ఒప్పుకున్నాను, లేకపోతే చేసేదాన్ని కాదు అనే రేంజ్ లో చెప్పుకొచ్చింది నిధి. ఇంకా సినిమా గురించి నిధి ఏమి చెప్పింది అంటే.. నిధి మాటల్లోనే.. ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు సుబ్బు. డాక్టర్ గా నటించాను.

    Also Read: షాకిచ్చిన రుద్రాణి కే మరో షాక్ ఇచ్చిన వంటలక్క!

    నా ఫాద‌ర్‌గా జ‌గ‌ప‌తిబాబు గారు నటించారు. నేను ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా త‌ర్వాత తమిళం, హిందీ సినిమా చేశానని మీకు తెలుసు. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ చిత్రం చేయ‌డం అదృష్టంగా భావిస్తా. పవన్ పెద్ద స్టార్ అయినా చాలా కూల్‌ గా వుంటారు అంటూ కామెంట్స్ చేసింది. నేను పుట్టింది హైద‌రాబాద్‌లోనే. తెలుగు ప‌రిశ్ర‌మ అంటేనే నాకు చాలా ఇష్టం. ‘ఇస్మార్ట్ శంకర్’ చేశాక గ్లామ‌ర్ హీరోయిన్ అనే ఇమేజ్ నాకు బాగా ప్లస్ అయింది. అదే నాకు కలిసొచ్చింది.

    ఇక నేను సినిమా సినిమాకూ చాలా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే డిఫ‌రెంట్ ద‌ర్శ‌కుల దగ్గర పని చేస్తే చాలా తెలుస్తాయి. అన్నట్టు నేను ఓటీటీ ప్రాజెక్టులు ఒప్పుకోవడం లేదు. సినిమాలకే నా ఓటు. ఇక నా ఫాలోయింగ్ విషయానికి వస్తే నేను హీరోయిన్ గా పరిచయం కాకముందే.. నాకు ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు ఫాలోవర్స్ నాకు ఇంకా పెరిగారు. నేను పోస్ట్ చేసే హాట్ ఫోటోల వల్లే, నాకు సినిమా అవకాశాలు వచ్చాయని మీకు తెలియదు.

    ఐతే, కొందరు ఆ ఫోటోలకు ఘోరంగా కామెంట్స్ పెడుతూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే, నేను మాత్రం వాటిని పెద్దగా ప‌ట్టించుకోను. ఏది ఏమైనా అసలు అందాల ప్రదర్శనలో తనను మించిన వాళ్లే లేరు అన్నట్టు ఉంటుంది నిధి అగర్వాల్.

    Also Read: చంద్రబాబుతో పొత్తుపై తొలిసారి స్పందించిన పవన్

    Tags