Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కృష్ణ తనయుడిగా తన నట వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న మహేష్ బాబు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్న మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా భారీ విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఏకంగా హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేయాలనే ఉద్దేశ్యం తో ఇటు రాజమౌళి, అటు మహేష్ బాబు ఇద్దరూ ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే 330 పై చిత్రాలకు కథా రచయితగా వ్యవహరించిన పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakroshna) గారు తెలుగులో నెంబర్ వన్ రైటర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక పరుచూరి గారు రీసెంట్ గా ఒక వీడియోలో మాట్లాడుతూ మహేష్ బాబు (Mahesh Babu) ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ చేస్తే తనకు అద్భుతంగా సెట్ అవుతుందని ఆయన లాంటి నటుడు మరెవరు ఉండరని అది నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా సూపర్ సక్సెస్ ను సాధించే సినిమా అవుతుంది అంటూ ఆయన కొన్ని కామెంట్లైతే చేశారు. ఇక మహేష్ బాబు అభిమానులకు సైతం ఆయన శివాజీ క్యారెక్టర్ చేయాలని మీరు కూడా కోరుకోండి అలా అయితే మహేష్ ఆ క్యారెక్టర్ చేస్తాడు.
చారిత్రక నేపథ్యంలో సాగే ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ వాళ్ల నాన్న కృష్ణ వేసిన ‘అల్లూరి సీతారామరాజు’ క్యారెక్టర్ లాగే చాలా బాగా ఎలివేట్ అవుతుంది అంటూ ఆయన చెప్పడం విశేషం… ఇక రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు అయిన ‘ శంబాజీ మహారాజ్’ జీవిత కథ ఆధారంగా ‘విక్కీ కౌశల్’ హీరోగా వచ్చిన ఛావా సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది.
ఇక ఇదే సమయంలో మహేష్ బాబు హీరోగా ఛత్రపతి శివాజీ సినిమా వచ్చినట్టయితే మాత్రం ఆ సినిమా తిరుగులేని గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని కూడా నమోదు చేసుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అంటూ ఆయన తెలియజేయడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే ఈరోజు ఛత్రపతి శివాజీ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి మహేష్ బాబు సైతం రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా తర్వాత ఛత్రపతి శివాజీ బయోగ్రఫీతో సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…