https://oktelugu.com/

ఆమెకు మళ్ళీ అవకాశం ఇవ్వాలి: పరుచూరి గోపాలకృష్ణ

సీనియర్ నటీమణి రమాప్రభ నటన గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు. ఏ పాత్రకైనా ప్రాణం పోయగల గొప్ప నటి ఆమె. కానీ ప్రస్తుతం ఆమె నటనకు దూరమయ్యారు. అయితే, ఈ విషయం తనను చాలా బాధ కలిగించింది అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెగ ఫీల్ అయిపోయారు. ‘పరుచూరి పలుకులు’ అంటూ పరుచూరి గోపాలకృష్ణ అప్పటి సినీ ప్రముఖుల గురించి చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా రమాప్రభతో తన పరిచయం, సినీ ప్రయాణం […]

Written By:
  • admin
  • , Updated On : August 2, 2021 6:11 pm
    Follow us on

    Rama Prabhaసీనియర్ నటీమణి రమాప్రభ నటన గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు. ఏ పాత్రకైనా ప్రాణం పోయగల గొప్ప నటి ఆమె. కానీ ప్రస్తుతం ఆమె నటనకు దూరమయ్యారు. అయితే, ఈ విషయం తనను చాలా బాధ కలిగించింది అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెగ ఫీల్ అయిపోయారు. ‘పరుచూరి పలుకులు’ అంటూ పరుచూరి గోపాలకృష్ణ అప్పటి సినీ ప్రముఖుల గురించి చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు.

    ఈ క్రమంలో భాగంగా రమాప్రభతో తన పరిచయం, సినీ ప్రయాణం గురించి ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొస్తూ.. ‘ఈరోజు మహా హాస్యనటి రమాప్రభగారి గురించి మాట్లాడుదాం. నాకు తెలిసి రమాప్రభ దగ్గర దగ్గర వెయ్యి పాత్రలైనా చేసి ఉంటుంది. నిర్మలమ్మ, అన్నపూర్ణమ్మ ఎలా అయితే అతి సహజంగా కనిపిస్తారో.. రమాప్రభ కూడా హాస్యంలో అంతే సహజంగా కనిపిస్తోంది.

    చిరంజీవి గారికి ఎలాగైతే బాడీ లాంగ్వేజ్‌లోనే ఫైట్‌.. డ్యాన్స్‌ ఉందో.. రమాప్రభకు కూడా బాడీలాంగ్వేజ్‌లోనే హాస్యం ఉంటుంది. ‘కథానాయకుడు’ సినిమాలో రమాప్రభ గారి ‘చంకలో పిల్లాడిని వేసుకొని వచ్చే పాత్ర’ మామూలుగా పండలేదు. నిజానికి తొలుత ఆ సినిమాలో ఆమెకు పాత్రే లేదు. కానీ.. ఆ పాత్రను మా అన్నయ్య సృష్టించారు.

    ఇక రాజాబాబుతో కలిసి రమప్రభ ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల వేశాలు వేసిన ఆవిడ ఇక్కడ ఉండకుండా.. తన సొంత గ్రామానికి వెళ్లి ఉంటున్నారని విన్నప్పుడల్లా బాధేసింది. ఎందుకంటే రమాప్రభ గారికి ఏ పాత్రిచ్చినా దానికి ఆవిడ ప్రాణం పోస్తారు.. పోసి తీరతారు. అంతటి నటీమణి ఆవిడ.

    ఓటీటీలు వచ్చాయి. ఈ మధ్య ఓ సినిమా చూశాను. అందులో మొత్తం పాత ఆర్టిస్టులే ఉన్నారు. . కాబట్టి.. సీనియర్‌ ఆర్టిస్టులకు మళ్లీ అవకాశం ఇవ్వాలని.. అందులో రమాప్రభ ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ ఆయన ముగించారు.