https://oktelugu.com/

Ram Pothineni- Parineeti Chopra: రామ్ పోతినేనితో పరిణితి చోప్రా రొమాన్స్.. నిజమేనా ?

Ram Pothineni- Parineeti Chopra: రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో రానున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పరిణితి చోప్రాతో చిత్రబృందం చర్చలు జరిపినట్లు టాక్ నడుస్తోంది. ఇందుకు ఆ బ్యూటీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైందని.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ టాక్. అన్నట్టు ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించనుంది. గోరింటాకు సినిమాతో […]

Written By: , Updated On : April 6, 2022 / 05:42 PM IST
Follow us on

Ram Pothineni- Parineeti Chopra: రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో రానున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పరిణితి చోప్రాతో చిత్రబృందం చర్చలు జరిపినట్లు టాక్ నడుస్తోంది. ఇందుకు ఆ బ్యూటీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైందని.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ టాక్.

Ram Pothineni- Parineeti Chopra

Ram Pothineni- Parineeti Chopra

అన్నట్టు ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించనుంది. గోరింటాకు సినిమాతో తన నటనతో ఆకట్టుకున్న నటి మీరా జాస్మిన్‌ తిరిగి టాలీవుడ్‍ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అసలు మీరా జాస్మిన్ అనగానే ఫ్యామిలీ రోల్స్ గుర్తుకు వస్తాయి. అంతగా ఆమె ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయి.. సక్సెస్ అయింది కూడా.

Also Read:  ‘రాధేశ్యామ్’ ప్రోమో అదిరింది.. పూజా – ప్రభాస్‌ కెమిస్ట్రీ కేక

కాగా ఈ మాజీ హీరోయిన్ మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తోంది. హీరో రామ్‌‍ తో.. బోయపాటి సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో హీరో అక్క పాత్రకు మీరాను సంప్రదించినట్లు సమాచారం. బోయపాటి ఇప్పటికే మీరాకు కథ, పాత్రను వివరించగా ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మీరా జాష్మిన్ మళ్ళీ అందాల ఆరబోతకు కూడా రెడీ అయ్యింది.

Ram Pothineni- Parineeti Chopra

Ram Pothineni, SRINU

నిజానికి గతంలో మీరా సోషల్‌ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండేది కాదు. కాగా 2014లో పెళ్లి చేసుకున్న తర్వాత మూవీలకు బ్రేకిచ్చింది మీరా. ప్రస్తుతం మకల్‌ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. అలాగే తాజాగా బోయపాటి సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. ఒకప్పుడు చాలా సాంప్రదాయంగా కనిపించిన మీరా జాస్మిన్ ఇప్పుడు గ్లామర్ షోకు దిగింది.

Also Read:  అక్కడ బాగా ఎంజాయ్ చేశాను అంటున్న కీర్తి సురేష్

Recommended Video:

Bheemla Nayak Record Breaking Advance Bookings || Pawan Kalyan || Ok Telugu Entertainment

Tags