Vijay- Dil Raju: ‘మున్నా’, ‘ఊపిరి’, ‘మహర్షి’ లాంటి భారీ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి. పైగా పెద్ద చిత్రాల దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో వంశీకి మంచి పేరు ఉంది. ఇక ఇలాంటి డైరెక్టర్ తో దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తోంది అంటే.. ఆ సినిమా పై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయి. పైగా దిల్ రాజు బ్యానర్ నుండి ఓ చిత్రం వస్తుందంటే అది హిట్టే అంటారు సినీ ప్రియులు.

ఈ క్రమంలో దేశ మార్కెట్‌పై కన్నేశాడు దిల్ రాజు. ఇప్పటికే జెర్సీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా, తమిళ స్టార్ విజయ్‌తో ఓ ద్విభాషా చిత్రాన్ని తీస్తున్నాడు. తమిళంలో విజయ్ నెంబర్ వన్ హీరో. అందుకే.. ఈ సినిమా సౌత్ లోనే భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, క్రేజీ భారీ సినిమా నేడు అధికారికంగా స్టార్ట్ అయ్యింది.
Also Read: K.G.F: Chapter 2: ‘కేజీఎఫ్ 2’ నుంచి ఎదగరా ఎదగరా.. క్షణాల్లోనే సంచలనాలు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నేడు లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. నేషనల్ క్రష్ రష్మిక ఇందులో హీరోయిన్, తమన్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇక కథానాయకుడిగా విజయ్ కి ఇది 66వ సినిమా. ఈ సినిమాతో విజయ్ మార్కెట్ కూడా తెలుగులో డబుల్ కానుంది.
దిల్ రాజు తెలుగులో అగ్రనిర్మాత. తన సినిమాను భారీగా రిలీజ్ చేసుకోవడంలో దిల్ రాజు ఎక్స్ పర్ట్. అందుకే.. విజయ్, దిల్ రాజు అడగగానే డేట్లు ఇచ్చాడు. పైగా వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇప్పటికే వంశీ నేషనల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా పెద్ద హీరోలు అందరితో సినిమాలు చేశాడు.

ఇప్పుడు ఏకంగా తన కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ స్టార్ అయిన తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. అన్నిటికీ మించి వంశీ చెప్పిన కథ విజయ్ కి బాగా నచ్చింది. అందుకే వీరి కాంబినేషన్ లో తెలుగు – తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. మరి ఇది ఏ స్థాయి హిట్ అవుతుందో చూద్దాం. ఈ నెల లాస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.
Also Read: MLA Roja: జబర్ధస్త్ నుంచి ఔట్.. రోజాకు మంత్రి పదవి ఖాయమైందా?
[…] Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. లవ్ స్టోరి హిట్ తర్వాత నాగ చైతన్య వరుస చిత్రాలను చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ చిత్రం పూర్తి కావస్తుండగా, తమిళ టాప్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ చిత్రాన్ని మొదలుపెట్టాడు. గతంలో అజిత్‌తో ‘మంకత్తా’ (గ్యాంబ్లర్) వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకట్ ఇటీవలి ‘మానాడు’తో సూపర్ హిట్ కొట్టి శింబుని మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కించాడు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలో రానుంది. […]
[…] Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ ప్రకృతితో మమేకమైంది. ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆవుతో సరదాగా ఆడుకుంటూ కనిపించి.. షాక్ ఇచ్చింది. […]