Director Parasuram Apologises: తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ ఊపు తగ్గింది. అయితే, ఈ సినిమాలో భారీ విజువల్స్ తో, మహేష్ – కీర్తి సురేష్ మధ్య బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ తో, అలాగే ఎమోషనల్ సీన్స్ తో.. పరశురామ్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అవ్వకపోయినా మరోసారి తనలో మ్యాటర్ ఉందని నిరూపించుకున్నాడు.

అయితే, నరసింహ స్వామి భక్తులకు సర్కారు పరశురాం పెట్ల క్షమాపణలు చెప్పాడు. మూవీలో నరసింహ స్వామిని కించపరిచేలా ఓ డైలాగు ఉందని పలువురు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయగా స్పందించారు. దేవుడంటే తనకు భక్తి ఉందని, ఇతరుల మనోభావాలు నొప్పించినందుకు క్షమించిండంటూ పేర్కొన్నారు.
Also Read: Ram Gopal Varma- Cheating Case: వర్మ పై 420 కేసు.. అలాగే మరో మూడో కేసులు కూడా !
ఏది ఏమైనా పరుశురాంకి ప్రస్తుతం వరుస అవకాశాలు ఉన్నాయి. ‘గీత గోవిందం’ సినిమాకి ముందు పరశురామ్ కి దర్శకుడిగా విలువ లేదు. కథ చెబుతాను అంటే.. చిన్నాచితకా హీరోలు కూడా ఆయనకు ఊ కొట్టలేదు. సినిమా లేక, ఏ హీరో డేట్లు ఇవ్వక, దాదాపు ఒక సినిమా కోసం నాలుగేళ్లు పరశురామ్ కష్టపడ్డాడు.

ఆ మాట కొస్తే.. కష్టాల మీదే ఆయన సినీ కెరీర్ సాగింది. ఈ క్రమంలో ‘గీత గోవిందం’ సక్సెస్ ఇచ్చిన కిక్ తోనే ఈ సారి యాక్షన్ ను కూడా జోడించి ‘సర్కారువారి పాట’ సినిమా చేశాడు. మనీ నేపథ్యంలో తీసిన ఈ సినిమాతో పరశురామ్ ఏవరేజ్ హిట్ ను అందుకున్నాడు. ఇక తన తర్వాత చిత్రాన్ని చైతుతో ప్లాన్ చేస్తున్నాడు పరుశురాం. ఇప్పటికే ఈ చిత్రం ఖరారైంది కూడా.
ఈ చిత్రం ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మరో ఐదు నెలల్లో ఈ సినిమా పూర్తవుతుంది. ఇప్పటికే కథని లాక్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు.
Also Read:Devi Nagavalli: దేవిని వెంటాడుతున్న ఆ డైలాగ్.. చివరికి కామెడీగా మారిన సీరియస్ వార్నిగ్
Recommended videos



[…] […]