ఎంటర్టైన్మెంట్Parasakthi Movie OTT: ఓటీటీ లోకి వచ్చేసిన శివ కార్తికేయన్ 'పరాశక్తి'.. తెలుగు వెర్షన్ ఎందులో...

Parasakthi Movie OTT: ఓటీటీ లోకి వచ్చేసిన శివ కార్తికేయన్ ‘పరాశక్తి’.. తెలుగు వెర్షన్ ఎందులో చూడాలంటే!

Parasakthi Movie OTT: ‘అమరన్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో తమిళ స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని రేంజ్ లో 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన శివ కార్తికేయన్(Sivakarthikeyan), ఆ తర్వాత చేసిన ‘మదరాసి’ చిత్రం పెద్ద ఫ్లాప్ గా నిల్చింది. అయితే ఈ చిత్రం తో పాటు ఆయన సమాంతరంగా చేసిన ‘పరాశక్తి'(Parashakti Movie) మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండేవి. కారణం ‘ఆకాశమే నీ హద్దురా’ వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన సుధా కొంగర(Sudha Kongara) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే. దానికి తోడు జయం రవి ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ లో నటించడం కూడా సినిమా పై మంచి అంచనాలను రేపింది. అలా భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతి కానుకగా తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ చిత్రానికి ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది.

సంక్రాంతి రేస్ లో పోటీకి మరో పెద్ద సినిమా లేకపోయినప్పటికీ కూడా, ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు అంతగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే క్లోజింగ్ లో రాబట్టింది. శివ కార్తికేయన్ కి తెలుగు లో మార్కెట్ ఉన్నప్పటికీ, ఈ సంక్రాంతికి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా సినిమాలు ఓవర్ లోడ్ అవ్వడం తో, తెలుగు వెర్షన్ లో ఈ చిత్రం విడుదల కాలేకపోయింది. అయితే ఈ సినిమాని ఈ నెల 7 వ తారీఖున ‘జీ5’ యాప్ లో తమిళ వెర్షన్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల చేయబోతున్నారు. చాలా సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అవుతూ, ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే సుధా కొంగర కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది, దానికి తోడు ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా విడుదల కాకపోవడం వల్ల కచ్చితంగా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా శివ కార్తికేయన్ సినిమా అంటే కచ్చితంగా తెలుగు ఆడియన్స్ ఒక్కసారైనా చూడాలని అనుకుంటారు కాబట్టి ఓటీటీ లో కచ్చితంగా ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటించగా, విలన్ గా జయం రవి నటించాడు. అదే విధంగా గద్దల కొండా గణేష్ ఫేమ్ ఆతర్వా మురళి కూడా ఇందులో కీలక పాత్ర పోషించాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Puri Jagannadh : పూరి జగన్నాధ్ కి డేట్స్ ఇచ్చిన మరో స్టార్ హీరో… పోకిరి రేంజ్ కథతో వస్తున్నాడా..?

Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జజగన్నాధ్ ఒకప్పుడు ఆయన దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటే...

Balakrishna: బాలయ్య – కొరటాల శివ మూవీలో నటించనున్న ఇద్దరు స్టార్ హీరోలు…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ముఖ్యంగా బీ,సీ సెంటర్లోని మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాడు. కమర్షియల్ సినిమాలకు పెట్టింది...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version