Anchor Sreemukhi Father: బుల్లితెర పై యాంకర్ సుమ(Suma Kanakala) తర్వాత అంతటి క్రేజ్ ని సంపాదించే యాంకర్లు రావడం చాలా కష్టం అని అంతా అనుకునేవారు. కానీ గత కొన్నేళ్ల నుండి శ్రీముఖి(Anchor Srimukhi) బుల్లితెర యాంకరింగ్ రంగం లో క్వీన్ లాగా కొనసాగుతుంది. సుమ కేవలం ఈటీవీ లోని ‘సుమ అడ్డా’ షోకి మాత్రమే పరిమితం కాగా, శ్రీముఖి ‘స్టార్ మా’ ఛానల్ లో దాదాపుగా అన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతోంది. ఈమె యానకరింగ్ కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కాదు, జెన్ Z ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ప్రోగ్రాం ని శ్రీముఖి సింగిల్ హ్యాండ్ తో నడిపిస్తుంది. అవినాష్ మరియు హరి లతో కలిసి ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు.
రీసెంట్ గానే 175 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది ఈ బిగ్గెస్ట్ కామెడీ షో. అంటే 175 వారాలు అన్నమాట. ఇది చిన్న విషయం కాదు. అంతకు ముందు స్టార్ మా ఛానల్ లో ప్రతీ షోకి శ్రీముఖి నే యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రదీప్ రీ ఎంట్రీ ఇవ్వడం తో ఈమెకు రావాల్సిన షోస్ కొన్ని ఆయనకు వెళ్లాయి. అందులో ఒకటి ‘BB జోడి 2’. మొదటి సీజన్ కి శ్రీముఖి నే యాంకర్ గా వ్యవహరించింది. కేవలం టీవీ షోస్ తో మాత్రమే కాదు, సోషల్ మీడియా లో ఈమె చేసే రీల్స్ కి మంచి క్రేజ్ ఉంది. తన మిత్రుడు అవినాష్ తో కలిసి ఈమె చేసే ఫన్నీ రీల్స్ కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి. అంతే కాకుండా తన డైలీ రొటీన్ అప్డేట్స్ ని కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది శ్రీముఖి.
రీసెంట్ గానే ఈమె తిరుమలకు అవినాష్, చైతు మరియు తన తండ్రి తో కలిసి కాలినడక ద్వారా వెళ్ళింది. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలను ఈమె సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలలో శ్రీముఖి తండ్రి ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఈయన చూసేందుకు చాలా అందంగా, మలయాళం మెగాస్టార్ మమ్మూటీ ని తలపించేలా ఉన్నాడు. ఈ ఫోటోని చూసిన నెటిజెన్స్, ఈయన అసలు మీ నాన్న అంటే నమ్మలేకపోతున్నాం, నీ అన్నయ్య లాగా అనిపిస్తున్నాడు, నీకంటే ఆయన అందం గా ఉన్నాడు, ఆయన అందం నీకు రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజెన్స్ ని అంతలా ఆకర్షించిన శ్రీముఖి తండ్రి ఫోటోలను మీరు కూడా చూసేయండి. మీకు కూడా అలాంటి అభిప్రాయమే కలిగిందా లేదా అనేది కామెంట్స్ రూపం లో తెలియజేయండి.
