Cinema News: సినిమా హిట్ ప్లాప్ అనేది ఎవరూ ఊహించలేరు. నిజానికి సినిమా విజయానికి ఇంతవరకు నిర్వచనం లేదు. రాలేదు. అయితే, ఒక్కోసారి మంచి సినిమాలు కూడా భారీ ప్లాప్ లు అవుతాయి. అయితే, అంతగా ఆడక పోయినా ఆ సినిమాలు మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు పెద్దగా ఆడవు. మరి ఆడక పోయినా ప్రేక్షకులు మెచ్చిన ఆ సినిమాల లిస్ట్ చూద్దాం.

బాణం :
ఇది నారా రోహిత్ నటించిన మొదటి చిత్రం. ఈ సినిమా స్టోరీతో పాటు ఇంకా కొన్ని సాంగ్స్ బాగుంటాయి. కానీ ఎందుకో ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించలేదు.
డేంజర్ :
తెలుగు సినిమా క్రియేటివ్ దర్శకుల్లో ఒకరైన కృష్ణవంశీ గారు ఈ సినిమాని తీశారు. ఐదు మంది స్నేహితులు కలిసి ఎదుర్కొనే థ్రిల్లర్ మూవీ ఇది. కథ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే కథనం కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ సినిమా కూడా కమర్షియల్ గా విజయం సాధించలేదు.
వినాయకుడు :
ఈ మూవీ లో కామెడీ ఇంకా సెంటిమెంట్ సీన్స్ బాగుంటాయి. సినిమాకి కూడా మంచి చిత్రం అని పేరు వచ్చింది. కానీ కమర్షియల్ గా విజయం సాధించలేదు.
ఒక మనసు :
ఇది మంచి ప్రేమ కథ చిత్రం. మనసుకి హత్తుకునేలా సెంటిమెంట్ సీన్స్ బాగుంటాయి. కానీ కమర్షియల్ గా విజయం సాధించలేదు.
కళ్యాణ వైభోగమే :
ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలు ఇంకా వివాహం లోని ప్రాముఖ్యత చక్కగా చిత్రీకరించారు. పైగా ప్రేక్షకులకు మంచి ఫీల్ క్రియేట్ చేశారు. అయినా ఎందుకో ఈ చిత్రం విజయం సాధించలేదు.
సీతయ్య :
సీతయ్య ట్రైలర్ లో ” బస్సు ఎక్కి వస్తాను … బండెక్కి వస్తాను … కార్ ఎక్కి వస్తాను ” అని సిమ్రాన్ తో మెరుపు మెరుపు బట్టలు వేసుకొని హరికృష్ణ డాన్స్ వెయ్యడం అప్పట్లో పెద్దగా ఎవరికీ కనెక్ట్ కాలేదు. సినిమా వర్కౌట్ కాలేదు. కానీ, ఈ సినిమా హరికృష్ణ కెరీర్ లోనే మంచి సినిమా.