Chiranjeevi and Nagababu : మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లకు తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ నేమ్ ఉంది. ముగ్గురు తమ తమ రంగాల్లో విజయపథంలో దూసుకుపోతున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా ప్రస్థానం పూర్తి చేసుకున్న చిరంజీవి ఇప్పటికీ సక్సెస్ఫుల్ హీరోగా ఉన్నారు. ఈ జనరేషన్ స్టార్స్ తో పోటీపడుతూ ఆయన అరుదైన విజయాలు అందుకుంటున్నారు. వంద కోట్లకు పైగా వసూళ్లు చిరంజీవి చిత్రాలు అలవోకగా రాబడుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. కూటమి ప్రభుత్వం అక్కడ అధికారం రావడానికి ఆయన కృషి ఎంతైనా ఉంది.
Also Read : పవన్ కళ్యాణ్ ప్రసంగం చూసి కంటతడి పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్!
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన మార్క్ పాలన, నిర్ణయాలతో ముందుకు వెళుతున్నాడు. ఇక నాగబాబు విషయానికి వస్తే.. ఆయన కూడా జనసేన కీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు. ఆ పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. త్వరలో నాగబాబు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. చిరు, నాగబాబు, పవన్ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ మెగా బ్రదర్స్ మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవి తన తమ్ముళ్లను బిడ్డల్లా భావిస్తాడు. అదే సమయంలో పవన్, నాగబాబు అన్నయ్య చిరు పట్ల ఎనలేని గౌరవం, అభిమానం కలిగి ఉంటారు.
అయితే చిరంజీవికి వీరిద్దరి కంటే నిర్మాత అల్లు అరవింద్ ఎక్కువ. ఆయన మాటే చిరంజీవి వింటారు అనే ఓ వాదన పరిశ్రమలో చాలా కాలంగా ఉంది. చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు కూడా కీలకమైన నిర్ణయాలు అల్లు అరవింద్ తీసుకున్నాడని అంటారు. నిజంగా అల్లు అరవింద్ సలహాలు, సూచనలు చిరంజీవి పాటిస్తారా? అంటే.. నిజమే అని నాగబాబు అన్నారు. అయితే అది కెరీర్ బిగినింగ్ లో అని వెల్లడించారు.
పరిశ్రమకు వచ్చిన కొత్తల్లోనే అన్నయ్య కు వివాహమైంది. ఆ సమయంలో అల్లు అరవింద్ చిరంజీవికి మద్దతుగా ఉండేవారు. ఆయన వ్యవహారాలు చూసుకునేవారు. చిరంజీవికి అల్లు అరవింద్ సలహాలు ఇచ్చేవాడు. ఆయన సజెషన్స్ కూడా బాగా ఉండేవి. అయితే ఒక దశకు వచ్చాక అన్నయ్యకు ఆ అవసరం లేకుండా పోయింది. కానీ మొదట్లో పడిన మార్క్ అనేది పోలేదు. అల్లు చిరంజీవికి అరవింద్ సలహాదారు అనే నానుడి కొనసాగుతుంది.. అని నాగబాబు ఓపెన్ అయ్యారు.
కాగా ఇటీవల మెగా-అల్లు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తాయనే పుకార్లు వినిపించాయి. అయితే ఇవ్వన్నీ పుకార్లు మాత్రమే. ఆ రెండు కుటుంబాలు అత్యంత సన్నిహితంగా ఉంటాయి. ఇదంతా మీడియా చేసే రాద్ధాంతం అనే వాదన ఉంది. ఇక చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లు పవన్, నాగబాబు అసెంబ్లీకి వెళ్లడం విశేషం.
Also Read : చిరంజీవికి యూకే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. మొదటి తెలుగు హీరో మెగాస్టార్