Paradise : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అష్టచమ్మా (Ashta Chamma) సినిమాతో హీరోగా పరిచయమైన నాని ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెను తిరిగి చూడకుండా వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగాయి. ఇప్పటి వరకు అయజంచేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. మొన్నటి వరకు ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ ను ఎక్కువగా ఎంకరేజ్ చేసిన నాని ఇప్పుడు మాస్ సినిమాలు చేస్తూ బీ,సీ సెంటర్లో ఉన్న ఆడియన్స్ ను సైతం మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దసర సినిమాతో మాస్ అటెంప్ట్ చేసిన ఆయన మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత చేసిన సరిపోదా శనివారం సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు ‘హిట్ 3’సినిమాతో మరోసారి వైలెన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తోడుగా ప్యారడైజ్ (Paradaise) సినిమాతో మరోసారి మాస్ జపం చేయడమే కాకుండా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చిలో రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పటినుంచి ఈ సినిమాకు సంబంధించిన భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడి చేత విజిల్స్ వేయించేలా ఉండడం నిజంగా చాలా గొప్ప విషయామనే చెప్పాలి… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : ప్యారడైజ్ మూవీలో ఇంపార్టెంట్ సీన్స్ కోసం భారీ సెట్ వేస్తున్నారా..?
ఇప్పటివరకు అయినా వరుస సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తన మార్కెట్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మాస్ సినిమాలకు సంబంధించి తనను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? లేదా అనే విషయంలో కూడా ఆయన చాలా వరకు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ప్యారడైజ్ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ తెగకు చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. మరి ఈ తెగలో అతని క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది. ప్రేక్షకులు అతన్ని ఆదరిస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సంవత్సరం ప్రకారమైతే ఈ సినిమాలో నాని ఒక వర్గానికి నాయకుడుగా ఎదగడమే కాకుండా ఆ జనాల్లో చైతన్యం తీసుకొచ్చే పాత్రలో నటిస్తున్నాడట.
అయితే ఈ సినిమా చివర్లో నాని క్యారెక్టర్ చనిపోతుంది అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి నిజానికి ఇందులో ఎంతవరకు వాస్తవ ఉంది అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా ద్వారా నాని ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇవ్వబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
Also Read : ప్యారడైజ్ లో ఫస్ట్ సీన్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది…