Paradise : శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో నాని (Nani) హీరోగా వస్తున్న ప్యారడైజ్ (Paradaise) సినిమా భారీ విజయాన్ని సాధిస్తోంది అంటూ ప్రతి ఒక్కరు దానిమీద మంచి అంచనాలైతే పెట్టుకున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో నాని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలని ప్రతి హీరో కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి వాళ్ళ ప్రయత్నానికి తగ్గట్టుగానే ఫలితం దక్కుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఇంతకుముందు దసర (Dasara) సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో ప్యారడైజ్ (Paradaise) అనే సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రెడీ చేశారు…ఆ గ్లింప్స్ కి చాలా మంచి క్రేజ్ దక్కడమే కాకుండా నాని డిఫరెంట్ లుక్ ను చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
Also Read : ప్యారడైజ్ మూవీలో ఇంపార్టెంట్ సీన్స్ కోసం భారీ సెట్ వేస్తున్నారా..?
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని మొదటి సీను ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆ సీన్ ఏంటి అంటే నాని చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అతనికి పాలు ఇస్తుంటే అందులోంచి రక్తం వస్తుందట. ఇక తన కొడుకుని బతికించుకోవడానికి ఆమె ఏం చేసింది అనే దాని మీదనే ఒక భారీ ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుందట.
మొత్తానికైతే శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ప్రతి ఒక్కరితో విజిల్స్ కొట్టించే విధంగా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక నాని ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరోసారి మాస్ హీరోగా మారడమే కాకుండా ఆయనలోని పోటెన్షియాలిటీ మొత్తాన్ని బయటికి తీసిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు.
లేకపోతే మాత్రం ఆయన భారీగా వెనుకబడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…మొత్తానికైతే శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించబోతున్నాడు అనేది చాలా క్లారిటీ గా తెలుస్తోంది.
Also Read : పెద్ది కోసం ప్యారడైజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్న శ్రీకాంత్ ఓదెల…కారణం ఏంటంటే..?